Rahul Dravid : బిసిసిఐ ఇచ్చిన ప్రైజ్ మనీ తిరస్కరించిన ద్రవిడ్..!
ప్రధానాంశాలు:
Rahul Dravid : బిసిసిఐ ఇచ్చిన ప్రైజ్ మనీ తిరస్కరించిన ద్రవిడ్..!
Rahul Dravid : టీ 20 వర్లడ్ కప్ లో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ తో 13 ఏళ్ల వరల్డ్ కప్ టైటిల్.. 17 ఏళ్ల నాటి టీ20 వరల్డ్ కప్ కల నిజమైంది. ఈసారి టీం ఇండియా ఆటగాళ్ల పనితీరు అద్భూం అమోఘమని చెప్పొచ్చు. ఐతే టీం ఇండియా కప్ గెలవడంతో బిసిసిఐ టీం ఇండియా మొత్తానికి 125 కోట్ల భారీ కానుక ప్రకటించింది. ప్లేయర్స్ తో పాటుగా అందరికీ ఇది సమానంగా పంచనున్నారు.ముందు అందరి ప్లేయర్స్ కి చెరో 5 కోట్ల దాకా పంచనున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోర్, బౌలింగ్ కోచ్ పరాజ్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ లకు రెండున్నర కోట్లు ఇవ్వనున్నారు.
Rahul Dravid ద్రవిడ్ మంచితనం ప్రైజ్ మనీ తిరస్కరణ
వరల్డ్ కప్ స్క్వాడ్ అయిన్మ 15 మంది ఆట గాళ్లకు ఐదు కోట్ల చొప్పున ఇవ్వనున్న బి.సి.సి.ఐ రిజర్వ్ ప్లేయర్స్ గా వెళ్లిన శుభ్ మన్ గిల్, రికూ సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లకు తలో కోటి ఇవ్వనున్నారు. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటనలో ఆట గాళ్లతో సమానంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి 5 కోట్లు ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయించింది. ఐతే రాహుల్ ద్రవిడ్ దాన్ని వద్దన్నారు. తన సహయ సిబ్బందికి ఇచ్చినంత ఇస్తే హాలు ఎక్కువ వద్దని ద్రవిడ్ అన్నాడట.
ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇస్తుంటే కాదనకుండా తీసుకుంటారు కానీ తన సహయక సిబ్బందికి తక్కువ ఇచ్చి తనకు ఎక్కువ ఇవ్వడం ఇష్టం లేని ద్రవిడి ఐదు కోట్లు వద్దని అందులో సగం 2.5 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి పూర్తి కాగా ఆ ప్లేస్ లో గౌతం గంభీర్ ని నియమించింది బిసిసిఐ. ఐపిఎల్ 2024 లో కె.కె.ఆర్ విజయంలో గంభీర్ ప్రభావం చాలా ఉంది. అందుకే అతన్ని బిసిసిఐ టీం ఇండియా హెడ్ కోచ్ గా సెలెక్ట్ చేసింది.