Rahul Dravid : వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి రాహుల్ ద్రావిడ్ విజ‌య‌గ‌ర్జ‌న‌.. ఘ‌న‌మైన వీడ్కోలు ఇచ్చిన టీమిండియా | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rahul Dravid : వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి రాహుల్ ద్రావిడ్ విజ‌య‌గ‌ర్జ‌న‌.. ఘ‌న‌మైన వీడ్కోలు ఇచ్చిన టీమిండియా

Rahul Dravid : టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోసం ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఆట‌గాడిగా ఉన్న‌ప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవాల‌నే ఆయ‌న క‌ల నెర‌వేర‌లేదు. క‌నీసం హెడ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో అయిన త‌న క‌ల నెర‌వేరుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ వ‌చ్చారు. ఇండియా- సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ద్రావిడ్‌కి చివ‌రి మ్యాచ్. ఈ టోర్నమెంట్‌తో ఆయన కాంట్రాక్ట్ గడువు కూడా ముగుస్తుంది. దీన్ని రెన్యూవల్ చేయలేదు […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rahul Dravid : వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి రాహుల్ ద్రావిడ్ విజ‌య‌గ‌ర్జ‌న‌.. ఘ‌న‌మైన వీడ్కోలు ఇచ్చిన టీమిండియా

Rahul Dravid : టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోసం ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఆట‌గాడిగా ఉన్న‌ప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవాల‌నే ఆయ‌న క‌ల నెర‌వేర‌లేదు. క‌నీసం హెడ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో అయిన త‌న క‌ల నెర‌వేరుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ వ‌చ్చారు. ఇండియా- సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ద్రావిడ్‌కి చివ‌రి మ్యాచ్. ఈ టోర్నమెంట్‌తో ఆయన కాంట్రాక్ట్ గడువు కూడా ముగుస్తుంది. దీన్ని రెన్యూవల్ చేయలేదు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయన సేవలు ఇక్కడితో చాలనుకుంది. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసింది.అయితే త‌న వీడ్కోలు ఘ‌నంగా ఉండాల‌ని, వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి గుడ్ బై చెప్పాల‌ని రాహుల్ ద్రావిడ్ ఎంతో అనుకున్నారు.

Rahul Dravid ఘ‌న‌మైన వీడ్కోలు..

Rahul Dravid వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి రాహుల్ ద్రావిడ్ విజ‌య‌గ‌ర్జ‌న‌ ఘ‌న‌మైన వీడ్కోలు ఇచ్చిన టీమిండియా

Rahul Dravid : వ‌ర‌ల్డ్ క‌ప్ చేత ప‌ట్టి రాహుల్ ద్రావిడ్ విజ‌య‌గ‌ర్జ‌న‌.. ఘ‌న‌మైన వీడ్కోలు ఇచ్చిన టీమిండియా

భార‌త ఆట‌గాళ్లు ద్రావిడ్ క‌ల‌ని సుసాధ్యం చేశారు. రోహిత్‌ శర్మ కప్పును అందుకున్న అనంతరం జట్టు సభ్యులంతా సందడి చేశారు. రోహిత్‌ స్టెప్పులేస్తూ వచ్చి టీ 20 ప్రపంచక్‌ను అందుకోగా…. అనంతరం ఆటగాళ్ల సందడి మాములుగా లేదు. ఈ సంబరాలు అన్నీ అయిపోయాకే విరాట్‌ కోహ్లీ… టీ 20 ప్రపంచకప్‌ను హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు అందించాడు. ఆటగాళ్లంతు చుట్టూ చేరి చూస్తుండగా రాహుల్‌ ద్రావిడ్‌ కప్పు పైకెత్తి విజయ గర్జన చేశాడు. దీనికోసమే కదా ఇన్నేళ్లు శ్రమపడ్డది అనేలా టీమిండియా హెడ్‌ కోచ్‌ ఆ క్షణాలను భావోద్వేగంతో ఆస్వాదించాడు. ఇక రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ.. రాహుల్ ద్రావిడ్‌ని ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిప్పారు.

T20 World Cup 2024 మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్ 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

T20 World Cup 2024 : మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్.. 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

టీమిండియా హెడ్ కోచ్‌గా 2021లో రాహుల్ ద్రావిడ్ అపాయింట్ అయ్యారు. ఆ ఏడాది యుఏఈ వేదికగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్.. ఛార్జ్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో కోచ్‌గా బోణీ కొట్టారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును రాటుదేల్చారు. ద్రావిడ్ పర్యవేక్షణలోనే గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఫైనల్స్ వరకూ వెళ్లగలిగింది టీమిండియా. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలమైంది. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. ఆ టోర్నమెంట్‌లో ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు రోహిత్ సేన. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన భార‌త జ‌ట్టు క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. గ్రాండ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు వీడ్కోలు ప‌లికింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది