Virender Sehwag Divorce : మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… వీరేంద్ర సెహ్వాగ్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virender Sehwag Divorce : మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… వీరేంద్ర సెహ్వాగ్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Virender Sehwag Divorce : మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు... వీరేంద్ర సెహ్వాగ్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడా..!

Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకుల‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముందుగా వారు Social Media సోష‌ల్ మీడియా వేదిక‌గా హింట్ ఇస్తూ ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా విడాకుల ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఇప్పుడు మాజీ క్రికెట‌ర్, డ్యాషింగ్ ఓపెన‌ర్  Virender Sehwag వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. భార్య Aarti Ahlawat ఆర్తితో ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త రిలేష‌న్ దెబ్బ‌తిన్న‌ట్లు ఓ క‌థ‌నం ద్వారా తెలిసింది. టెస్టు Cricket క్రికెట్‌లో రెండు సార్లు ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన సెహ్వాగ్‌.. ఆర్తిని 2004 డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఆ జంట‌కు ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు ఉన్నారు. ఆర్య‌వీర్ 2007లో జ‌న్మించ‌గా, ఇక వేదాంత్ 2010లో పుట్టాడు. అయితే ఓ క‌థ‌నం ప్ర‌కారం.. సెహ్వాగ్‌, ఆర్తి మ‌ధ్య వైవాహిక బంధం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Virender Sehwag Divorce మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు వీరేంద్ర సెహ్వాగ్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడా

Virender Sehwag Divorce : మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… వీరేంద్ర సెహ్వాగ్ డైవ‌ర్స్ తీసుకోబోతున్నాడా..!

Virender Sehwag Divorce ఇన్నేళ్ల త‌ర్వాత ఏం జ‌రిగింది..!

ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు Virender Sehwag  సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.వీరూ, ఆర్తి ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. 2004 డిసెంబర్ లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది. కొన్ని నెలల క్రితం ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయని, కొంత కాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గత ఏడాది దీపావళి సందర్భంగా తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, విడాకుల అంశంపై వీరూ కానీ, ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

గతేడాది నవంబర్‌లో జరిగిన ప్రతీష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహార్ ట్రోఫీలో సెహ్వాగ్ త‌న‌యుడు ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏజ్ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. రెండో కుమారుడు వేదాంత్ Virender Sehwag సెహ్వాగ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ప్రతిష్టాత్మక అండర్ 16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో వేదాంత్  Virender Sehwag సెహ్వాగ్.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓవైపు పిల్లలు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటే.. మరోవైపు తల్లిదండ్రులు విడిపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, క్రికెట్‌లో ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిదే.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది