Rohit Sharma : టెస్ట్‌లలో రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ…10 టెస్ట్‌లలో ఏడు ఓటమి.!
ప్రధానాంశాలు:
Rohit Sharma : టెస్ట్‌లలో రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ...10 టెస్ట్‌లలో ఏడు ఓటమి.!
Rohit Sharma : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేజిక్కించుకున్న తర్వాత టీమిండియా తో పాటు కెప్టెన్ Rohit Sharma రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తుంది. అతనిని రిటైర్ కావాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.3 జనవరి 2025 రోజు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏదైనా గాయం లేదా మరేదైనా కారణాల వల్ల జట్టు కెప్టెన్ ప్లేయింగ్-11కి దూరంగా ఉండాల్సి రావడం గమనార్హం. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చేర్చలేదు. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ టెస్ట్ కెరీర్‌పై ప్రశ్నార్థకమైంది.పెర్త్‌లో జరిగిన టెస్ట్‌లో గెలిచిన తర్వాత టీమిండియా అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోయింది…
Rohit Sharma : రోహిత్‌కి కష్టాలు..
తను ఫామ్‌లో లేని కారణంగా Rohit Sharma రోహిత్ శర్మ సిడ్నీలో ఆడబోనని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు సమాచారం. దీని గురించి Rohit Sharma రోహిత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా తెలియజేసాడు. గంభీర్, అగార్కర్ ఇద్దరూ దీనికి అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే గత నాలుగైదు నెలల్లో టీమ్ ఇండియా మొత్తం 10 టెస్టు మ్యాచ్ లు ఆడింది. వీటిలో ఐదు సొంతగడ్డపై.. మిగతావి ఆస్ట్రేలియాలో బోర్డర్ గావస్కర్ సిరీస్ లో కాగా, ఇందులో మొత్తం గెలిచినవి మూడు మాత్రమే. రెండు బలహీన బంగ్లాదేశ్ పై భారత్ లో, మరొకటి ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు. ఇక న్యూజిలాండ్ అయితే సొంత గడ్డపై భారత్‌ని క్లీన్ స్వీప్ చేసింది.
అయితే టెస్టు మ్యాచ్ లు మరో ఆరు నెలల వరకు లేవు.. Rohit Sharma కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే జూన్ లో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అప్పటికి రోహిత్ తో పాటు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా? అంటే డౌట్ అని చెప్పాలి. త్వరలో టీమిండియా టి20లు, వన్డేల్లో అత్యంత దూకుడుగా ఆడే ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ నెల 22 నుంచి ఐదు టి20ల సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్, విరాట్ అద్భుత ప్రదర్శన కనబరచని పక్షంలో వారి కెరీర్ ఖతం అయినట్టే అలని చెప్పాలి. ఇప్పుడు అతనికి వైట్ జెర్సీ ఫార్మాట్‌లో అవకాశం లభించే అవకాశం లేదు. ఎందుకంటే, గత కొంత కాలంగా టెస్టుల్లో హిట్ మ్యాన్ ఆడుతున్న తీరు అతడి టెస్టు కెరీర్ కు ఫుల్ స్టాప్ పడబోతోందని సూచిస్తోంది.