Yuvraj Singh : యువరాజ్ సింగ్ అరెస్టు వెనుకున్న అసలు కథ మీకు తెలుసా?
Yuvraj Singh : క్రికెట్ అభిమానులకు చాలా ఇష్టమైన ప్లేయర్ టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. యువీ ఆటను అందరూ ఇష్టపడుతుంటారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మ్యాన్‌గా యువీ సంచలన రికార్డులు సృష్టించాడు. క్రీజులో నిలబడే బంతులను బౌండరీ దాటేలా కొట్టగల ఆటగాడు యువీ. 2011 ప్రపంచ వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడం యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సంగతులు పక్కనబెడితే.. తాజాగా యువరాజ్ సింగ్ అరెస్టు దేశంలోనే సంచలనంగా మారింది.పలు కారణాల వల్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ ప్రజెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన సహచర ఆటగాడు స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశించి యువీ సరదాగా కామెంట్స్ చేశాడు.
అయితే, ఆ కామెంట్స్ కాస్తా సీరియస్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఆ కామెంట్స్‌ను బేస్ చేసుకుని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లా హన్సీ పోలీసులు యువరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటలు విచారించారు. ఆ తర్వాతనే ఆయన్ను బెయిల్‌పై బయటకు పంపారు. యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో చాహల్ గురించి మాట్లాడుతూ సరదాగా చేసిన కామెంట్స్‌లో షెడ్యూల్స్ కులాన్ని కించపరిచేలా ఉన్నాయని అప్పట్లో దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు తమ కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ హిసార్‌కు చెందిన లాయర్ ఒకరు హన్సీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. దాంతో పోలీసులు యువరాజ్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కూడా. ఇకపోతే యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ ఏమిటంటే..
Yuvraj Singh : ఆ కామెంట్సే అరెస్టుకు కారణం..
లాక్ డౌన్ టైంలో చాలా మంది ఇళ్లల్లో ఖాళీగానే ఉంటూ వీడియోస్ షూట్ చేసుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఓ కులానికి చెందిన మనుషుల లాగా చాహల్ కూడా ఏ పనీ పాటా లేకుండా ఆ పనులు చేస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. ఇది కాస్తా వివాదాస్పదమయింది. లాయర్ ఫిర్యాదుతో కేసు నమోదు అనంతరం యువీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం జడ్జి బెయిల్ ఇచ్చారు. కాగా, తాను కావాలని అటువంటి కామెంట్స్ చేయలేదని, ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, అలా కామెంట్స్ చేసినందుకుగాను తాను బాధపడుతున్నానని యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు.