500 Note Ban : ఏంటి.. రూ.500 నోట్లని కూడా రద్దు చేయబోతున్నారా..?
ప్రధానాంశాలు:
500 Note Ban : ఏంటి..రూ.500 నోట్లని కూడా రద్దు చేయబోతున్నారా..?
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం రేపుతోంది. ఈ ఫేక్ మెసేజ్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని అన్ని ఏటీఎంలలో రూ.500 నోట్లు ఇవ్వకుండా ఆదేశించిందట. అంతేకాదు, 2026 మార్చి 31 తరువాత 90 శాతం ఏటీఎంలు కేవలం రూ.100 మరియు రూ.200 నోట్లు మాత్రమే ఇస్తాయని ఈ సందేశంలో పేర్కొంటూ, ప్రజలు వెంటనే తమ వద్ద ఉన్న రూ.500 నోట్లు ఖర్చు చేయాలని హెచ్చరిస్తోంది…
500 Note Ban : ఏంటి.. రూ.500 నోట్లని కూడా రద్దు చేయబోతున్నారా..?
500 Note Ban అవన్నీ అవాస్తవం..
ఈ సందేశం వేగంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ వేదిక PIB Fact Check స్పందించింది. ఆ సందేశాన్ని స్క్రీన్‌షాట్‌గా షేర్ చేస్తూ ..అది పూర్తిగా తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. RBI నుంచి ఇలాంటి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని, ప్రజలు ఇలాంటి అసత్యమైన వార్తల్ని నమ్మకూడదని హెచ్చరించింది.
PIB ఫ్యాక్ట్ చెక్ మరో అడుగు ముందుకు వేసి, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు పూర్తిగా చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది. వాటిని మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది. “రూ.500 నోట్లు చెలామణిలోనే కొనసాగుతాయి. RBI అలాంటి ఏ ఆదేశాలూ ఇవ్వలేదు,” అని స్పష్టం చేసింది.ఇతర నోట్లు గురించి కూడా RBI తాజా సమాచారం ఇచ్చింది. 2025 మేలో వచ్చిన మింట్ పత్రిక నివేదిక ప్రకారం, త్వరలో RBI కొత్త డిజైన్‌లో రూ.20 నోట్లు విడుదల చేయనుంది. ఈ నోట్లపై నూతన గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. అయితే ఇప్పటికే చలామణిలో ఉన్న ₹20 నోట్లు కూడా చట్టబద్ధంగా కొనసాగుతాయని RBI స్పష్టం చేసింది.