Electric Car : బంపర్ ఆఫర్.. రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు.. మధ్యతరగతి ప్రజల కోసమే
Electric Car : అదేంటి.. ఈరోజుల్లో బైక్ కొనాలంటేనే లక్ష పెట్టాలి. అలాంటిది 99 వేలకే ఎలక్ట్రిక్ కారు ఇవ్వడం ఏంటి అంటారా? అవును.. ఇది నిజం. 99 వేలకే కారును ఇస్తున్నారు. అది కూడా ఎలక్ట్రిక్ కారు. నమ్మశక్యంగా లేకున్నా నమ్మాల్సిన నిజం ఇది. ఈ కారును తయారు చేసింది ఎక్కడో తెలుసా? చైనాలో. అలీబాబా కంపెనీ తెలుసు కదా. చైనాలో పెద్ద ఈకామర్స్ సంస్థ ఇది. ఆ కంపెనీయే ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. కాకపోతే ఇది 5 సీటర్ కారు కాదు. 2 సీటర్ కారు. అంటే.. ఒక డ్రైవర్, పక్కనే మరో సీటు అంతే. ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలు ఉండే కారు అన్నమాట.
ఇది వరకు మన దేశంలో టాటా కంపెనీ నానో కారును తయారు చేసింది. కానీ.. ఆ కారు ఎలక్ట్రిక్ కారు కాదు. లక్ష రూపాయలు అని చెప్పినా ఆ కారుకు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ.. అలీబాబా కంపెనీ తయారు చేసిన ఈ కారుకు మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది చైనాలో. ఆ కారును ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్ ఆఫ్ ది వీక్ పేరుతో సేల్ నిర్వహించగా అందులో అమ్మారు. ఆ కారును 1199 డాలర్లకు అమ్మేశారు. అంటే మన కరెన్సీలో 99 వేల రూపాయలు అన్నమాట.
Electric Car : గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించే కారు
ఏదో ఇద్దరే కూర్చొని వెళ్తారు కదా.. ఇదేం స్పీడ్ వెళ్తుంది అని అనుకునేరు. ఈ కారు గంటకు 120 కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. పార్కింగ్ కష్టాలు ఉండవు. చిన్న చిన్న సందుల్లోనూ వెళ్తుంది. రోజు వారి పనుల కోసం ఈ కారును వినియోగించుకోవచ్చు. చైనాలో తప్ప ఈ కారును వేరే దేశాలకు తీసుకెళ్లే చాన్స్ లేదు కాబట్టి ఈ కారును మనం ఇండియాలో చూడలేం. చైనా వాళ్లు అయితే ఈ కారును కొనుక్కోవచ్చు. కాకపోతే మన టాటా నానో కారు కంటే కూడా తక్కువ ధరకే ఈ కారు లభ్యం అవుతోంది. చైనాలో ఈ కారు కోసం జనాలు ఎగబడుతున్నారట. సేల్స్ కూడా బాగానే ఉన్నట్టు అలీబాబా కంపెనీ వెల్లడించింది.