Amazon – Flipkart : దసరా ఆఫర్లతో కొన్ని కోట్ల వ్యాపారం చేసిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు…
Amazon – Flipkart : ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ దసరా ఆఫర్లతో కొన్ని కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు ప్రతిఏటా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది దసరా సందర్భంగా కొన్ని వస్తువులపై భారీ ఆఫర్లను తీసుకొచ్చాయి. దీంతో వినియోగదారులు కూడా ఇదే మంచి అవకాశం అని ఫుల్ షాపింగ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తుంది. అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్స్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు, ఫ్రిజ్లు, స్మార్ట్ టీవీలు గృహోపకరణాల వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
జనాలు కూడా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై ఈ కామర్స్ సంస్థలు కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లపై భారీ ఆఫర్లను ప్రకటించడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు లాంటి వస్తువులతోపాటు దుస్తులు లాంటి ఫ్యాషన్ సంబంధిత కొనుగోలు కూడా భారీగా పెరిగాయి. దీంతో అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో కొన్ని కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి.
రెడ్ సీర్ అనే కన్సల్టెన్సీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య ఏకంగా 1100 మొబైల్ ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ ఫోన్లు విలువ దాదాపు 11 వేల కోట్లు. ఇక ఫ్యాషన్ విభాగంలో సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగంలో నాలుగున్నర రేట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. వీటి విలువ ఏకంగా 5,500 కోట్లు కావడం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే కేవలం నాలుగు రోజుల్లో ఈ కామర్స్ సంస్థలు ఏకంగా 24,500 కోట్ల వ్యాపారం చేయడం విశేషం.