Home » News » Amazon Offers On Apple Iphone 12 Smart Phone
News

iPhone 12 : అమెజాన్ లో బంపర్ ఆఫర్… ఆపిల్ ఐఫోన్ 12 పై భారీ డిస్కౌంట్…

Authored By
aruna
The Telugu News | Published on: September 15, 2022, 9:00 pm
Advertisement

iPhone 12 : ప్రముఖ టెక్ దిగ్గజం అయిన ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ ను లాంచ్ చేసింది. కొత్త మోడల్ లాంచ్ కావడంతో అంతకుముందు ఉన్న ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధరలు భారీగా తగ్గుతున్నాయి. అయితే అమెజాన్ అందిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్లో ఈ ఐఫోన్ మోడల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంకు డీల్స్ ఇన్స్టాంట్ డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ ఆఫర్లతో బెస్ట్ ప్రైస్ కు ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్లో ఐఫోన్ 12 ధర భారీగా తగ్గింది. ఐఫోన్ వాడాలనుకునేవారు అతి తక్కువ ధరకే ఆపిల్ ఫోన్ లో సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ లో ఐఫోన్ 12 ధర చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఐ ఫోన్స్ బెస్ట్ ఆఫర్లు అందిస్తుంది.

Advertisement

ఐఫోన్12 64 జిబి వేరియంట్ అసలు ధర 65,999. అయితే ప్రస్తుతం అమెజాన్ డిస్కౌంట్ లో దానిని కేవలం 52,999కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది. స్మార్ట్ఫోన్ పై భారీగా 20% డిస్కౌంట్ అందిస్తుంది. ఎక్సైంజ్ ఆఫర్ ద్వారా ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. అమెజాన్ ఐఫోన్ 12 పై భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ అందిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 10,550 వరకు ధరను తగ్గించవచ్చు. ఐఫోన్ 12 ను కేవలం 42,440 అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఎంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుందనేది పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ఐఫోన్ 12 పై ఎలాంటి బ్యాంక్ ఆఫర్లను అందించలేదు.

Amazon offers on apple iPhone 12 Smart Phone

Advertisement

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు ఐఫోన్ 12 ఇతర వేరియంట్లు కూడా అప్లై అవుతాయి. 128 జీబీ వేరియంట్ కూడా రూ.54,999కి లభిస్తుంది. 2021 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్ గా ఐఫోన్ 12 నిలిచింది. ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో పాపులర్ అయింది. అందుకే ఐఫోన్ 14 లాంచ్ అయిన తర్వాత కూడా ఐఫోన్ 12 కు డిమాండ్ తగ్గలేదు. కానీ తాజా ధర మాత్రం తగ్గింది. ఐఫోన్ 12 2532×1170-పిక్సెల్ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీ,HRD సపోర్ట్ తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ను అందిస్తుంది. ఈ ఫోన్ 2,815mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 20w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి