Electric Scooter : మార్కెట్లోకి వచ్చిన మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్… ధర ఎంతంటే…!
Electric Scooter : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తమ కంపెనీల నుంచి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ధర కొద్దిగా ఎక్కువైనా సరే వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా కంపెనీ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టాయి.
ఈ క్రమంలో తాజాగా భారతీయ అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటో కార్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి విడుదల చేసింది. విడా వీ1, వీ1 ప్రో పేర్లతో రెండు వేరియంట్ లలో స్కూటర్లను విడుదల చేసింది. హీరో స్కూటర్లను శుక్రవారం నాడు రిలీజ్ చేసింది. ఇక ఈ స్కూటర్ల ఫీచర్ల ఈ విధంగా ఉన్నాయి. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ స్ర్టూమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్లు వెళ్లవచ్చు.ఫాలో మీ హోమ్ లైట్ ఎస్ఓఎస్ అలర్ట్ రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఎన్నో ఫీచర్లు స్కూటర్ లో అందించారు.
ఓటీఏ అప్ డేట్ లను అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఈ స్కూటర్ బుకింగ్ అక్టోబర్ 10వ తేదీన ప్రారంభించనున్నారు. డెలివరీని డిసెంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నారు. ఈ స్కూటర్ల కోసం తైవాన్ళకి చెందిన గోగోరో పాట్నర్ షిప్ కుదిర్చుకుంది. వీడా వీ1 భారత్ లో 1.45 లక్షల ప్రారంభ ధర నిర్ణయించింది. వీడా ప్రో ధర రూ.1.59 లక్షలు గా ఉంది. రూ.2499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ మూడు నగరాల్లో విడుదల ప్రారంభమవుతాయి.