iPhone 14 : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్… రాబోతున్న 14 సిరీస్ ఐఫోన్… లాంచింగ్ ఎప్పుడంటే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

iPhone 14 : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్… రాబోతున్న 14 సిరీస్ ఐఫోన్… లాంచింగ్ ఎప్పుడంటే…

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,12:00 pm

iPhone 14 : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. సరికొత్త ఫీచర్స్ తో రాబోతున్న ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్. ఆపిల్ ఫోన్ లాంచ్ ఈవెంట్ మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఐఫోన్ 14 సిరీస్ తో పాటు మరిన్ని ప్రోడక్ట్ లను సెప్టెంబరు ఏడవ తేదీన జరిగే ఈవెంట్ లో ఆపిల్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 13 సిరీస్ తో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు ఊహించని అప్ గ్రేడ్ తో వస్తాయని ఇప్పటికే చాలా లీకులు వచ్చాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఐఫోన్ 14 , ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ రానున్నాయి.

ఆపిల్ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఇండియన్ టైం ప్రకారం బుధవారం రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. ఆపిల్ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ లో ఈ ఈవెంట్ ను లైవ్ లో చూడొచ్చు. ఐఫోన్ 14 ధర ఐఫోన్ ధర కంటే తక్కువగా ఉంటుందని అంచనా ఉంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 13 ప్రారంభ ధర అమెరికాలో 799 డాలర్లుగా ఉంది. అయితే ఐఫోన్ 14న యాపిల్ ఈసారి 749 డాలర్లకే అంటే భారత్ లో సుమారు 60,000 లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 14 మ్యాక్స్ ధర 849 డాలర్లు ఉండే అవకాశం ఉంది. లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ ధరలను ఆపిల్ అధికారికంగా ప్రకటించనుంది. అమెరికాతో పోలిస్తే ఇండియాకు వచ్చేసరికి ఐఫోన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందంట. ఐఫోన్ 14 సిరీస్ 6.1 ఇంచులు, ఐఫోన్ 14 మాక్స్ 6.7 ఇంచులు ,ఐఫోన్ 14 ప్రో 6.1 ఇంచులు, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్ప్లే తో రానున్నట్లు తెలుస్తుంది.

Apple iPhone 14 series launch event today

Apple iPhone 14 series launch event today

ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కెమెరా చాలా అప్ గ్రేడ్లతో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మొదటిసారి 48 మెగా పిక్సెల్ కెమెరాను ఆపిల్ అందిస్తుందని తెలుస్తుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వెనుక 48 మెగా పిక్సెల్ ప్రైమరీ, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ శాటిలైట్ కనెక్టివిటీ తో రానున్నాయి. సెల్యులర్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా సాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా కాల్స్, మెసేజ్ లు చేసుకునే అవకాశం ఉంది. ముందుగా ఈ ఫీచర్ అమెరికాలో పనిచేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 కొత్త ఐప్యాడ్ మోడల్ రెండో జనరేషన్ ఎయిర్ పోడ్స్ ప్రో కొత్త మ్యాక్ బుక్ ను ను కూడా ఆపిల్ లాంచ్ చేయనుందని సమాచారం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది