Apple : ఐఫోన్ ప్రో మోడల్స్ తయారీతో దేశంలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్న యాపిల్
Apple ; టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది. తన రాబోయే ఐఫోన్ ప్రో మోడల్‌లను మొదటిసారిగా భారతదేశంలో తయారు చేయడం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలో 6 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి యాపిల్ సిద్ధంగా ఉంది. ఆపిల్ దాదాపు 2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనుందని, అందులో 70 శాతం మహిళలకు మాత్రమేనని వెల్లడించింది. అయితే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం […]
ప్రధానాంశాలు:
Apple : ఐఫోన్ ప్రో మోడల్స్ తయారీతో దేశంలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్న యాపిల్
Apple ; టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది. తన రాబోయే ఐఫోన్ ప్రో మోడల్‌లను మొదటిసారిగా భారతదేశంలో తయారు చేయడం ద్వారా ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలో 6 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి యాపిల్ సిద్ధంగా ఉంది. ఆపిల్ దాదాపు 2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనుందని, అందులో 70 శాతం మహిళలకు మాత్రమేనని వెల్లడించింది. అయితే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో మూడు పరోక్ష ఉద్యోగాలను సృష్టించనుంది.
ఆపిల్ తన తమిళనాడు ఫ్యాక్టరీలో ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌ల తయారీని ప్రారంభిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఇప్పటికే వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 9న ‘ఇట్స్ గ్లోటైమ్’ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతుందని పేర్కొంది.ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ ప్రోను తయారు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి వినియోగదారులకు ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్నఏంటంటే భారతదేశంలో ఐఫోన్ ప్రో మోడల్‌లు చౌకగా లభిస్తాయా? అని. దీనిపై సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) వీపీ – ఇండస్ట్రీ రీసెర్చ్ గ్రూప్ (ఐఆర్‌జి) ప్రభు రామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆపిల్ తక్కువ ధరలకు విక్రయించే అవకాశం లేదన్నారు. కాకపోతే స్థానిక ఉత్పత్తి కొంత ధర తగ్గింపులకు దారితీయవచ్చని పేర్కొన్నారు.
IDC అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్‌కేందర్ సింగ్ స్పందిస్తూ.. ధరలను ప్రభావితం చేసే అనేక అంశాలు ఇప్పటికీ ఉన్నందున ధరపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. అసెంబుల్ చేయబడిన యూనిట్‌పై కూడా సుంకం మొత్తం ఎక్కువగా ఉండడమే కారణమని చెప్పారు. ఎందుకంటే చాలా భాగాలు ఇప్పటికీ పూర్తిగా నాక్ డౌన్ కిట్‌లలో దిగుమతి అవుతున్నట్లు తెలిపారు. ఆపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఇది కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో లాంచ్ నిర్వహించబడుతుంది. ఈ ఈవెంట్‌లో ఆపిల్ నాలుగు మోడళ్లను ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మాక్స్.