Credit Card : క్రెడిట్ కార్డ్ వాడే వారికి అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్…!
ప్రధానాంశాలు:
Credit Card : క్రెడిట్ కార్డ్ వాడే వారికి అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్...!
Credit Card : భారతదేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) మొదలు కానున్న నేపథ్యంలో ఆర్థిక నియమాల్లో మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ పాయింట్ల సహా తదితర అంశాలపై ప్రభావం చూపిస్తాయి.

Credit Card : క్రెడిట్ కార్డ్ వాడే వారికి అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్…!
credit card ఇవి గమనించాలి..
ఎయిర్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు 15 రివార్డ్ పాయింట్లను అందిస్తుండగా, ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు 5కి తగ్గించింది. అదేవిధంగా ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ప్రతి రూ.100 ఖర్చుకు కేవలం 10 పాయింట్లను మాత్రమే అందిస్తుంది, మార్చి 31 తర్వాత కార్డులను రెన్యూవల్ చేసే వారికి IDFC ఫస్ట్ బ్యాంక్ ఒక సంవత్సరం పాటు యాన్యువల్ ఫీజు మాఫీ చేస్తోంది.
సింపుల్ క్లిక్కర్ SBI కార్డ్ అందించే రివార్డ్ పాయింట్లను ఇప్పుడు తగ్గించనుంది. స్విగ్గీలో ఖర్చు చేసే వాటినిపై 10x రివార్డ్ పాయింట్లు ఏప్రిల్ 1 నుండి 5xకి తగ్గించనుంది. అయితే, మింత్ర, బుక్ మై షో, అపోలో 24 వంటి ఇతర పార్ట్నర్ బ్రాండ్‌లపై 10x రివార్డ్ పాయింట్ల బెనిఫిట్స్ కొనసాగుతుంది. యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్ విషయంలో ఏప్రిల్ 18 నుండి బెనిఫిట్స్ సవరిస్తుంది. ఈ తేదీన లేదా ఆ తర్వాత కార్డులను రెన్యూవల్ చేసేవారికి అన్యువల్ ఫీజు వసూలు చేయదు,