Airtel : అనుకోకుండా డేటా అయిపోతే వంద రూపాయల లోపు అద్భుతమైన డేటా ప్లాన్స్..!
ప్రధానాంశాలు:
Airtel : అనుకోకుండా డేటా అయిపోతే వంద రూపాయల లోపు అద్భుతమైన డేటా ప్లాన్స్..!
Airtel : భారత టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ, తాము అందించే రీఛార్జ్ ప్లాన్‌లపై రూ.10–12% సగటు పెంపు ఉంటుందట. అయితే ప్లాన్స్ గురించి సరైన వివరాలు ఇంకా బయటకు రాలేదు. బేస్ ప్లాన్‌లు మినహా ఇతర ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో అనేక డేటా ప్లాన్‌లు ఉన్నాయి. ఇందులో కేవలం రూ.11 ధరకే అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది.

Airtel : అనుకోకుండా డేటా అయిపోతే వంద రూపాయల లోపు అద్భుతమైన డేటా ప్లాన్స్..!
Airtel : బెస్ట్ ప్లాన్స్..
అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే కాగా, అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. రూ.22 ప్లాన్ చూస్తే దీనికి 1GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలు ఉండవు. వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చాట్ చేసేందుకు ఒక్కరోజు వ్యాలిడిటీతో ఈ డేటా సరిపోతుంది. రూ.26 ప్లాన్ చూస్తే.. యూజర్లు 1.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డేటాను ఒక్క రోజులో వినియోగించుకోవాల్సి ఉంటుంది.
డేటా మినహా కాలింగ్, SMS ప్రయోజనాలను పొందలేరు. అత్యవసర సమయాల్లో చాటింగ్, బ్రౌజింగ్ కోసం ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు రూ.33 రీఛార్జ్ ప్లాన్ : ఈ డేటా ప్లాన్‌లో యూజర్లు 2GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక రోజుగా ఉంది. రూ.49 రీఛార్జ్ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది. ఈ ప్లాన్‌లో డేటా మాత్రమే వస్తుంది. రూ.77 రీఛార్జ్ ప్లాన్లో యూజర్లు 5GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. కాలింగ్, SMS ప్రయోజనాలు లేవు. రూ.99 రీఛార్జ్ ప్లాన్లో యూజర్లు అన్‌లిమిటెడ్ 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా కాలింగ్, SMS వంటి ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేవు.