BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి శుభ‌వార్త‌.. దిమ్మ‌తిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగ‌తావారు స‌ర్ధుకున్న‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి శుభ‌వార్త‌.. దిమ్మ‌తిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగ‌తావారు స‌ర్ధుకున్న‌ట్టేనా?

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి శుభ‌వార్త‌.. దిమ్మ‌తిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగ‌తావారు స‌ర్ధుకున్న‌ట్టేనా?

BSNL : దేశంలోని టెలికాం రంగంలో అంబాని నెల‌కొల్పిన జియో సంస్థ ఎలాంటి సంచ‌ల‌న‌నాలు సృష్టిస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు వ్యాపారంలోని తోటి ఆట‌గాళ్ల‌ని తొక్కుకుంటూ జియో ముందుకు సాగినప్పటికీ ఇకపై ఆ ఆట అంత సులువైనది కాదని తేటతెల్లం అయ్యింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత అంబానీని ఎదిరించే స్థాయికి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ చేరుకుంటోంది. ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్ ఛార్జీలను భారీగా పెంచింది. ఇది కాకుండా వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా రీఛార్జ్ ఛార్జీలను దాదాపు 26 శాతం పెంచాయి. కాని బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందిస్తోంది.

BSNL బంప‌ర్ ప్లాన్..

దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చుకుంటున్నారు. అయితే 108 రూపాయ‌ల బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో యానిమేటెడ్ కాల్స్ మరియు 35 రోజుల చెల్లుబాటుతో అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తోంది. త‌క్కువ ధ‌ర‌కి డ్రాప్-ఫ్రీ కాలింగ్ కోరుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ ఉత్తమమైన‌ది చెప్పాలి. ఈ సిమ్ ప్లాన్ నెల వ‌ర‌కు చెల్లుబాటు అవుతుంది. మీరు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా ఒక నెలపాటు ఉచితంగా అపరిమిత కాల్‌లు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుంగా మొత్తం 60GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక ప్ర‌తి రోజు 2జీబీ డేటా ఉప‌యోగించుకోవ‌చ్చు.

BSNL బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి శుభ‌వార్త‌ దిమ్మ‌తిరిగే రీచార్జ్ ప్లాన్స్ మిగ‌తావారు స‌ర్ధుకున్న‌ట్టేనా

BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి శుభ‌వార్త‌.. దిమ్మ‌తిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగ‌తావారు స‌ర్ధుకున్న‌ట్టేనా?

అపరిమిత 40kbph వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు దేశంలో 30 రోజుల నుండి 360 రోజుల వరకు తక్కువ ధరకు మంచి సేవను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కొన్ని నెలల్లో 5G నెట్‌వర్క్‌ను కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. మ‌రోవైపు ఇందులో కేవలం రూ. 485తో రీచార్జ్ చేసుకుంటే మీరు ప్రతిరోజూ 1.5GB డేటా, 100 SMSలు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అయిన‌ రూ. 485 ప్లాన్ 84 రోజులు కాకుండా 82 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీంతో ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ కంపెనీ ప్లాన్ ఉపయోగపడుతుందో మీరే నిర్ణయించుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది