BSNL సిమ్ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో మెరు తెలుసుకోండి..?
ప్రధానాంశాలు:
BSNL సిమ్ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో మెరు తెలుసుకోండి..?
BSNL సిమ్ కార్డ్ కోసం రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. BSNL ఈమధ్యనే 4జి సేవలను ప్రారంభించింది. BSNL నెట్ వర్క్ లోని పాత 2జి, 3జి సేవలు అప్గ్రేడ్ చేశారు. ప్రధాన పట్టణాల్లో BSNL 4జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐతే 4జి సాంకేతికత, స్వదేశీయంగా తయారు చేయబడిన స్పెక్ట్రం పరికరాలతో వస్తుంది. అందుకే కనెక్టివిటీ కోసం అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు వారి టారిఫ్ రేట్లను పెంచుతూ వినియోగదారుల బడ్జెట్ పై ఒత్తిడి తెస్తున్నారు. నెల వారి రీచార్ 300 కామన్ అయ్యింది. అంతేకాదు మళ్లీ ఇతర ఖర్చు ఎక్కువ చేశారు.
BSNL మొబైల్ రీచార్జ్ కోసమే 3, 4 వేలు..
నెల వారీ రీచార్ 300 కాగా మూడు నెలలకు 700 నుంచి 1000 చేశారు. ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు ఉంటే వారికి ప్రతి నెల మొబైల్ రీచార్జ్ కోసమే 3, 4 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే తక్కువ రీచార్జ్ ప్లాన్స్ ఉన్న బి.ఎస్.ఎన్.ఎల్ కి మారుతున్నారు. BSNL కొత్త 4జి సేవలు వినియోగదారులకు మంచి ఆఫర్లు అందిస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో బి.ఎస్.ఎన్.ఎల్ 4జి సేవలు అందిస్తున్నారు.
BSNL4జి లో అపరిమిత కాల్స్, డేటా కోసం నెల వారీగా తక్కువ మొత్తాన్నే చెల్లించాల్సి వస్తుంది. ఐతే BSNL నుంచి రోజు వారీ డేటా 2జిబి ఇస్తూ కేవలం 397 రూపాయలకే 150 రోజ్ల వ్యాలిడిటీ ఇస్తున్నారు. అంట్ 5 నెలల పాటు 400 రీచార్జ్ తో అపరిమిత కాల్స్ ఇంకా రోజుకి 2జిబి డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వల్ల అందరు బి.ఎస్.ఎన్.ఎల్ కి మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు BSNL ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది.