Cell Phone : సెల్ ఫోన్ ను నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
Cell Phone : ప్రస్తుతం మనం ఉన్న ఆధునిక కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇక చిన్నారులకు అయితే ఫోన్ ఇవ్వకపోతే తిండి కూడా తినడం లేదు. వారు ఏడిస్తే ఫోన్, తినాలంటే ఫోన్ ఇలా ప్రతి ఒక్కదానికి ఫోనే ప్రపంచంగా మారింది. అలాగే ఆఖరికి బాత్రూంకి వెళ్ళాలి అన్న కూడా సెల్ ఫోన్ లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఇలా రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోతుంది. […]
ప్రధానాంశాలు:
Cell Phone : సెల్ ఫోన్ ను నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!
Cell Phone : ప్రస్తుతం మనం ఉన్న ఆధునిక కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇక చిన్నారులకు అయితే ఫోన్ ఇవ్వకపోతే తిండి కూడా తినడం లేదు. వారు ఏడిస్తే ఫోన్, తినాలంటే ఫోన్ ఇలా ప్రతి ఒక్కదానికి ఫోనే ప్రపంచంగా మారింది. అలాగే ఆఖరికి బాత్రూంకి వెళ్ళాలి అన్న కూడా సెల్ ఫోన్ లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఇలా రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోతుంది. దీంతో మనిషి సెల్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు. కాస్త ఖాళీగా టైం దొరికితే చాలు మనుషులతో మాట్లాడడమే మానేసి ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. కానీ ఫోన్ వాడటం వల్ల ఆరోగ్యం పై ఎంతో ఎఫెక్ట్ పడుతుంది అని ఆలోచన ఎవరు కూడా చేయలేకపోతున్నారు. అలాగే సెల్ ఫోన్ పై కొత్తగా జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కౌమర దశలో ఉన్నవారు ప్రతిరోజు నాలుగు గంటల కంటే ఎక్కువ టైం స్పోర్ట్ ఫోన్ చూస్తే మానసికంగా ఒత్తిడి మరియు డిప్రెషన్ లోకి వెళ్తారు. దీంతో నిద్ర సమస్యలు మరియు కంటి సమస్యలు మాత్రమే కాకుండా పలు రకాల సమస్యలకు కూడా దారితీస్తుంది అని తేలింది…
సెల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ : కౌమర దశలో ఉన్నవారు స్మార్ట్ ఫోన్ ని వాడడంపై కొరియాలోని హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ బృందం పలు రకాల పరిశోధనలు చేసింది. దీనిలో 50వేల కంటే ఎక్కువ మందిపై కొన్ని అధ్యయనాలు చేసింది. అయితే ఈ కౌమార దశలో ఉన్నవారు రోజుకు నాలుగు గంటల కంటే అధిక టైం స్మార్ట్ ఫోన్ ను వాడడం వలన ఒత్తిడి మరియు ఆత్మహత్య,ఆలోచనలు, మాదకద్రవ్యాల వాడకం లాంటి అలవాట్లు అధికంగా ఉన్నాయని తేలింది. అలాగే ఫోన్ ని చాలా తక్కువగా వినియోగించే వారిలో మాత్రం ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయి అని తేలింది.
దృష్టిలోపం ఏర్పడుతుంది : ఫోన్ ను ఎక్కువగా వాడితే నిద్రపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రీన్ చూస్తే సరిగ్గా నిద్ర కూడా పట్టదు. దీనివలన మేలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. అలాగే ఫోన్ లైట్ ఎక్కువగా కంటి పై పడడం వలన నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫోన్ చూస్తూ ఉండడం వలన కళ్ళు పొడిబారిపోవడం మరియు తలనొప్పి, నీరసం, అలసట లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కంటి సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాక రోజంతా ఫోన్ వాడడం వలన మెడ మరియు వెన్నుముక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున సెల్ ఫోన్ వాడేవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు..