Thumukunta : నేరవేరిన దీర్ఘకాల స్వప్నం .. తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కొత్త బస్సు సౌకర్యం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thumukunta : నేరవేరిన దీర్ఘకాల స్వప్నం .. తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కొత్త బస్సు సౌకర్యం

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2026,8:59 pm

ప్రధానాంశాలు:

  •  Thumukunta : నేరవేరిన దీర్ఘకాల స్వప్నం .. తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కొత్త బస్సు సౌకర్యం

Thumukunta : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. కాలనీ నుండి సికింద్రాబాద్ వరకు నడిచే ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సేవల ప్రారంభోత్సవాన్ని జిల్లా ఆర్టిఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి స్థానిక నాయకులు మరియు కాలనీ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రారంభ దశలో రెండు ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా రవాణా సమస్యలకు పరిష్కారం చూపించారు.

New bus facility for Thumkunta Double Bedroom Colony

Thumukunta : నేరవేరిన దీర్ఘకాల స్వప్నం .. తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీకి కొత్త బస్సు సౌకర్యం

ఈ సందర్భంగా భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కొత్త బస్సు సౌకర్యం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సులభంగా నగరానికి చేరుకోగలరని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులకు ఇది గణనీయమైన ఉపశమనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని బస్సు సర్వీసులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని సమయపాలన పాటించాలని సూచించారు.

బస్సు సౌకర్యం ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, హకీంపేట్ డిపో మేనేజర్ సరిత తదితర అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొల్లబోయిన నాగమణి, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, గట్టు ప్రదీప్ కుమార్, టిఆర్ రవీందర్ గౌడ్, మోత్కుల మల్లేష్ యాదవ్, మహమ్మద్ గౌస్ బాబా, బాణాల మధుసూదన్ రెడ్డి, అలాగే కాలనీ వాసులు యస్ నర్సింగ్ రావు,యమ్ చంద్రశేఖర్, ఆర్ అనిల్ కుమార్, గణేష్ నాయక్, జి సురేష్, జె శివ నాయక్, పి రాము తదితరులు పాల్గొన్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది