UPI : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం… ఎందుకంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

UPI : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం… ఎందుకంటే…?

UPI : కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ సేవలపై ఎటువంటి చార్జీలు తీసుకోవట్లేదని వెల్లడించింది. డిజిటల్ బ్యాంక్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలు విధించునున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి దీనిపై ఒక క్లారిటీ చేసింది. యూపీఏ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని ఆర్థిక […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 August 2022,7:30 am

UPI : కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ సేవలపై ఎటువంటి చార్జీలు తీసుకోవట్లేదని వెల్లడించింది. డిజిటల్ బ్యాంక్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలు విధించునున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి దీనిపై ఒక క్లారిటీ చేసింది. యూపీఏ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని ఆర్థిక శాఖ తెలిపింది. కాస్ట్ రికవరీ కోసం రివైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రతి యూపీఐ చెల్లింపులకు అదనపు చార్జీలు విధించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన చేసింది. యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గుడ్. యూపీఐ సేవలకు చార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది.

Central government has given good news to UPI users

Central government has given good news to UPI users

డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను ప్లాట్ఫారంలను ఆర్థికంగా వినియోగదారుల స్నేహపూర్వకంగా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రకటించింది. ప్రస్తుతం అధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యుపిఐ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని వెల్లడించింది దీంతో యూపీఐ వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది