Online Fraud : ఆన్‌లైన్ నేర‌గాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్ట‌ర్.. రూ.76.5 ల‌క్ష‌లు స్వాహ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Online Fraud : ఆన్‌లైన్ నేర‌గాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్ట‌ర్.. రూ.76.5 ల‌క్ష‌లు స్వాహ‌

Online Fraud : డిజిటల్ ప్రపంచంలో Digital World  పెరుగుతున్న సైబర్ నేరాల cyber crime గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో… నేటి రోజుల్లో, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం విస్తృతంగా పెరిగింది, ముఖ్యంగా యువతలో, అయితే దీనితో పాటు సైబర్ నేరాల ప్రమాదం కూడా పెరిగింది.నకిలీ స్కీమ్ లతో పెద్ద పెద్ద వాళ్లని కూడా మోసం చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఒక‌ ప్రభుత్వ వైద్యుడు స్కామర్‌ల బారిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Online Fraud : ఆన్‌లైన్ నేర‌గాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్ట‌ర్.. రూ.76.5 ల‌క్ష‌లు స్వాహ‌

Online Fraud : డిజిటల్ ప్రపంచంలో Digital World  పెరుగుతున్న సైబర్ నేరాల cyber crime గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో… నేటి రోజుల్లో, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం విస్తృతంగా పెరిగింది, ముఖ్యంగా యువతలో, అయితే దీనితో పాటు సైబర్ నేరాల ప్రమాదం కూడా పెరిగింది.నకిలీ స్కీమ్ లతో పెద్ద పెద్ద వాళ్లని కూడా మోసం చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఒక‌ ప్రభుత్వ వైద్యుడు స్కామర్‌ల బారిన పడ్డాడు, పెట్టుబడులపై అధిక రాబడిని ఇస్తామని వాగ్దానం చేసి మోసగించి ₹76.5 లక్షలు పోగొట్టుకున్నాడు.తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడిని మోసగాళ్లు నట్టేట ముంచారు.

Online Fraud న‌ట్టేట ముంచాడు..

యూట్యూబ్ ఛానల్‌లోని youtube channel ఒక ప్రకటనను నమ్మి అక్కడి లింక్‌పై క్లిక్ చేయడంతో ఏకంగా 76.5 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసగాళ్లతో నిండిన ఓ వాట్సప్‌ గ్రూప్‌కు ఆ లింక్ ద్వారా రీడైరెక్ట్ అయినట్లు డాక్టర్ తెలిపారు. అక్కడ పలువురు నకిలీ ఇన్వెస్టర్స్ లాభపూరిత వ్యూహాల గురించి చర్చిస్తూ తన విజయగాథలను షేర్ చేసినట్లు వెల్లడించారు.దివాకర్ సింగ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఆ గ్రూప్ నడపబడతున్నట్లు డాక్టర్ తెలిపారు. తరచుగా వ్యాపార సూచనలు, పెట్టుబడి సలహాలు ఇస్తూ తనలో నమ్మకాన్ని పెంచారని చెప్పారు. దీంతో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కోసం గ్రూప్‌లో సూచించిన ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరిచినట్లు వివరించారు.

Online Fraud ఆన్‌లైన్ నేర‌గాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్ట‌ర్ రూ765 ల‌క్ష‌లు స్వాహ‌

Online Fraud : ఆన్‌లైన్ నేర‌గాళ్ల ఉచ్చులో చిక్కుకున్న డాక్ట‌ర్.. రూ.76.5 ల‌క్ష‌లు స్వాహ‌

నమ్మకం కలగడంతో వారి సూచనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టడం సైతం ప్రారంభించానన్నారు.పెట్టుబ‌డులు పెడుతున్న కొద్ది లాభాలు పెరుగుతాయ‌ని న‌మ్మ‌బ‌లికి త‌న‌ని మోసం చేసిన‌ట్టు అత‌ను చెప్పుకొచ్చాడు. 30 శాతం లాభాలను వాగ్దానం చేయడంతో వారిని గుడ్డిగా నమ్మినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అదనపు ఫీజు అడగడంతో మోసానికి గురయ్యారనే విషయం త‌న‌కి అర్ధ‌మైంద‌ని ఆయ‌న వాపోయారు. అందుకే ఎవ‌రు ఎప్పుడు కూడా అన‌ధికృత లింకులు ఎట్టి ప‌రిస్థితుల‌లో క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని సూచ‌న చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది