Electric Cars : త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు.. కేవ‌లం కి.మీకి రూ3.50 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Electric Cars : త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు.. కేవ‌లం కి.మీకి రూ3.50 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు…!

Electric Cars : ప్ర‌స్తుతం మార్కెట్‌లోకి వివిధ ర‌కాల కార్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఈవీ కార్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్‌లోకి మరో ఈవీ కార్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఈవీ కార్‌ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది ఎక్స్‌షోరం ధరమాత్రమే. జెడ్‌ఎస్‌ ఈవీ, కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 September 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Electric Cars : త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు.. కేవ‌లం కి.మీకి రూ3.50 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు...!

Electric Cars : ప్ర‌స్తుతం మార్కెట్‌లోకి వివిధ ర‌కాల కార్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఈవీ కార్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్‌లోకి మరో ఈవీ కార్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఈవీ కార్‌ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది ఎక్స్‌షోరం ధరమాత్రమే. జెడ్‌ఎస్‌ ఈవీ, కామెట్‌ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్‌ కారు విండోసోర్‌ కావడం విశేషం. కొత్తగా బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ ప్రోగ్రామ్‌ని సైతం ఎంజీ ప్రారంభించ‌గా, ఇందులో కిలోమీటర్‌కు రూ.3.5 చొప్పున చెల్లించి బ్యాటరీని తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక కారు అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ అక్టోబర్‌ 3న మొదలై.. 12 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Electric Cars స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో…

ఎంజీ దీనిని సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్) గా పిలుస్తుంది. ఈ కొత్త ఈవీ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీల మధ్య ధరతో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కారు విడుదలతో మార్కెట్‌లో తన గ్రిప్‌ని మరింత పెంచుకోవాలని ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈవీ కార్లతో పోలిస్తే విండ్‌సోర్‌ డిజైన్‌ భిన్నంగా ఉంటుంది. లుక్స్‌లో ఉలుంగ్‌ క్లౌడ్‌ ఈవీ తరహాలో రూపొందించగా.. భారత్‌లో అవసరమైన పలు మార్పులు చేసి ప్రత్యేకంగా గుర్తింపును తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ కారు చైనా వులింగ్‌ క్లౌడ్‌ ఈవీ రీ బ్రాండెడ్‌ వెర్షన్‌. ఇది ఎంపిక చేసిన గ్లోబల్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్నది. ఇక ఎండీ విండ్‌సోర్‌ ఈవీ 134 బీహెచ్‌పీ, 200 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఉంటుంది.

Electric Cars త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు కేవ‌లం కిమీకి రూ350 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు

Electric Cars : త‌క్కువ ధ‌ర‌తో ఈవీ కారు.. కేవ‌లం కి.మీకి రూ3.50 చెల్లిస్తే ప్ర‌శాంతంగా చ‌క్క‌ర్లు కొట్టొచ్చు…!

ఎంజీలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ వాటాలు కొనుగోలు చేసిన అనంతరం విడుదల చేసిన తొలి ఈవీ ఇదే. జెడ్‌ఎస్‌ ఈవీ, కామెట్‌ ఈవీలకు భిన్నంగా మిడ్‌సైజ్‌ క్రాసోవర్‌ డిజైన్‌లో కంపెనీ రూపొందించింది. అత్యాధునిక ఫీచర్స్‌తో పాటు ప్రయాణికులకు విశాలమైన స్పేస్‌ని ఆఫర్‌ చేసినట్లు కంపెనీ చెప్పింది. . బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్తో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కావున బ్యాటరీ కోసం కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కారుని బై బ్యాక్‌ పాలసీలో 3 సంవత్సరాల తర్వాత కూడా 60 శాతం సొమ్ముని తిరిగి పొందవచ్చు. ఈ విండ్సర్ ఈవీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కాగా.. టెస్ట్ డ్రైవ్స్‌ 25 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12 నుంచి ఈ కార్లను కస్టమర్లకు డెలివరీలు చేయనున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది