Electric Cars : తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్స్… ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ చుట్టేయచ్చు…
Electric Cars : ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇప్పటికే బైకులు, స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల పైన కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిలో కొన్ని చౌక ధరకు లభిస్తున్న కార్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. టాటా కంపెనీలు పలు మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మహీంద్రా, ఓలా కంపెనీలు కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్ని తక్కువ ధరకు లభిస్తున్నాయి.
1) టాటా నెక్సాన్ EV ప్రైమ్: ఈ కారు దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఇందులో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు వెళుతుంది దీని ధర 14.79 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. 2) The Tigor EV : ప్రస్తుతం మన ఇండియాలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ద్వారా 12.4 9 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా జిప్ ట్రాన్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 306 కిలోమీటర్ల వరకు వెళుతుంది. 3) Tata Nexon EV Max : ఇది నెక్సాన్ ఈవి అప్గ్రేడెడ్ వర్షన్. ఇది పెద్ద బ్యాటరీ బ్యాక్ కలిగి ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 432 కిలోమీటర్ల వరకు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీని ధర 17.74 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
4) MG ZS EV : ఎలక్ట్రిక్ కార్ 50.3kwh బ్యాటరీ ని కలిగి ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఎలక్ట్రిక్ మోటార్ 176 పవర్ 280 ఎన్ ఎమ్ టార్క్ చేయగలదు. దీని ధర 21.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5) Hyundai kona Electric : ఈ కార్ ను మొదటిగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు 32.9kwh బ్యాటరీ ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని ధర 23.84 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 6) All Electric Mahindra XUV 400 : మహేంద్ర కంపెనీ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొస్తుంది. శుక్రవారం దీనిని లాంచ్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. 39.4kwh బ్యాటరీ ని కలిగి ఉంది. డిసెంబర్ లో టెస్ట్ డ్రైవ్ లు మొదలవుతుంది. వచ్చే సంవత్సరం బుకింగ్స్ ప్రారంభమవుతాయి.