New Cars in 2025 : జనవరిలో రాబోతున్న కొత్త ఎల‌క్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో మీకు న‌చ్చిన కారు ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Cars in 2025 : జనవరిలో రాబోతున్న కొత్త ఎల‌క్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో మీకు న‌చ్చిన కారు ఉందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :3 January 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  New Cars in 2025 : జనవరిలో రాబోతున్న కొత్త ఎల‌క్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో మీకు న‌చ్చిన కారు ఉందా?

New Cars in 2025 : భారత ఆటోమొబైల్ మార్కెట్‌కు 2024 తీపి గుర్తులనే మిగిల్చి వెళ్లింది అని చెప్పాలి. అయితే గ‌త ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాహ‌న త‌యారీ సంస్థ‌లు కొత్త వాహ‌నాల‌ని త‌యారు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా జనవరి నెలలో తమ కొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో దిగ్గజ కార్ల సంస్థలు టాటా, మహీంద్రా, బెంజ్, కియా, ఎంజీ మోటార్ వంటి సంస్థలు ఉన్నాయి. రానున్న ఈ కార్లలో ఫ్యూయల్ పవర్డ్ కార్లు మొదులుకుని ఈవీల వరకు అన్నీ ఉన్నాయి. వాటిలో Hyundai Creta EV ఒక‌టి. హ్యుందాయ్ తన బెస్ట్ సెల్లింగ్ కార్ క్రెటా electric cars ఎలక్ట్రిక్ వేరియంట్‌ను జనవరి 17, 2025న విడుదల చేయబోతోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని అనేక మీడియా నివేదికలలో క్లెయిమ్ చేస్తున్నారు.

New Cars in 2025 జనవరిలో రాబోతున్న కొత్త ఎల‌క్ట్రిక్ కార్లు లిస్ట్‌లో మీకు న‌చ్చిన కారు ఉందా

New Cars in 2025 : జనవరిలో రాబోతున్న కొత్త ఎల‌క్ట్రిక్ కార్లు.. లిస్ట్‌లో మీకు న‌చ్చిన కారు ఉందా?

New Cars in 2025 కొత్త మోడల్ కార్ల రంగ ప్రవేశం..

TATA Harrier EV, Safari EVకూడా జ‌న‌వ‌రి నెల‌లో విడుద‌ల కానున్నాయి. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం డ్యూయల్ మోటార్ AWD లేఅవుట్ ఎంపిక హారియర్,సఫారి EVలలో ఉంటుందని భావిస్తున్నారు. MG Cyberster జనవరి 2025లో మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌కార్ సైబర్‌స్టార్‌ను విడుదల చేయవచ్చు. కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన ‘MG సెలెక్ట్’ డీలర్‌షిప్ ద్వారా ఇది విక్రయిస్తుంది. ఈ EVకి పవర్‌ట్రెయిన్‌గా 2 ఎలక్ట్రిక్ మోటార్లు అందిస్తారు. Maruti Suzuki E Vitara మారుతి సుజుకీ తొలిసారిగా EV రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ రాబోయే EV మారుతి సుజుకి E-Vitara. వచ్చే నెల 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించబోతున్న‌ట్టుగా తెలుస్తుంది.

ఇక E Vitara వినియోగదారులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని అందించగలదని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.జనవరి 9న తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric Suv) మోడల్ అయిన ఈక్యూ‌ఎస్‌ ఎస్‌యూవీ 450ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు… 122 KWh బ్యాటరీ ప్యాక్ తో రెండు ఎలక్ట్రిక్ మోటార్స్‌తో రానుంది. ఇందులో ఐదుగురు వరకు ప్రయాణించొచ్చు. గ్గజ వాహన తయారీ సంస్థ కియా కొంత గ్యాప్ తర్వాత మరో కొత్త మోడల్‌తో మార్కెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. సైరస్ ఎస్‌యూవీ మోడల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో లో లాంఛ్ చేయనుంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ,1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రానుంది. ఈ కారు.. 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ యూనిట్‌తో అందుబాటులో ఉండనుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది