Flipkart Amazon Discount Sale : ఫ్లిప్ కార్డ్, అమెజాన్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్ ఫోన్ లపై మునుపెన్నడు లేని డిస్కౌంట్..!
Flipkart Amazon Discount Sale : ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌తో ప్రజలను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ముందుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ లో భాగంగా ఈరోజు నుంచి అందుబాటులో ఉంది. ప్రైమ్ మెంబర్లకు ఈ అవకాశం నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. అమెజాన్ బాటలోనే ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కూడా నేటి నుంచి మొదలు పెట్టింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు నిన్నటి […]
ప్రధానాంశాలు:
Flipkart Amazon Discount Sale : ఫ్లిప్ కార్డ్, అమెజాన్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్ ఫోన్ లపై మునుపెన్నడు లేని డిస్కౌంట్..!
Flipkart Amazon Discount Sale : ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌తో ప్రజలను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ముందుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ లో భాగంగా ఈరోజు నుంచి అందుబాటులో ఉంది. ప్రైమ్ మెంబర్లకు ఈ అవకాశం నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. అమెజాన్ బాటలోనే ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కూడా నేటి నుంచి మొదలు పెట్టింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు నిన్నటి నుంచే ఈ ఆర్లు అందుబాటులో ఉన్నాయి. రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు చాలా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను ఇస్తున్నారు అవేంటో చూద్దాం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా ల్యాప్‌టాప్‌లు ఇంకా టీవీలు అన్నిటికి భారీ డిస్కౌంట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇది చాలదు అన్నట్టుగా ఎస్.బి.ఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది. అమెజాన్ సేల్ లో స్మార్ట్ ఫోన్ ల పై దాదాపు 40 శాతం దాకా తగ్గింపు ధరలు ఉన్నాయి. వన్ ప్లస్ 12 ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ధర 42999 ధర మర్కెట్ లో ఉండగా ఈ సేల్ లో 37999 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఇక యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ల్యాప్ ట్యాప్ ను కూడా 52990 కే అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు ఈ.ఎం.ఐ ఆప్షన్ కూడా ఉంది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో గూగుల్ పిక్సల్, పోకో, వివో, నథింగ్, శాంసంగ్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హె.డి.ఎఫ్.సి డెబిట్, క్రెడిట్ కార్డ్ పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. దసరా కానుకగా ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్లు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కామర్స్ సంస్థలు పండుగని క్యాష్ చేసుకునేందుకు ఎన్నో రకాల డిస్కౌంట్స్ తో వస్తున్నారు.