iFFALCON Smart TV : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. 43 అంగులాల 4కే టీవీ ధర కేవలం రూ.16వేలకే..?
iFFALCON Smart TV : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నేటి రాత్రితో ముగియనుంది. ఇందులో ఎలక్ట్రానికి ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కొనసాగుతున్నాయి. సెలక్టెడ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారు బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందుబాటులో ఉన్న ఐ ఫాల్కన్ 43 అంగులాల 4కే టీవీని ఒకసారి చూస్తే బెటర్..బిగ్ బిలియన్ డేస్ ఈ రాత్రికే కంప్లీట్ కానుండగా.. ఇందులో టీసీఎల్ బ్రాండ్ ఐ ఫాల్కన్ 43 అంగులాల 4కే స్మార్ట్ టీవీ ఆఫర్ మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది.
ఇది సామాన్యులకు చాలా బెస్ట్ ఆఫర్. బడ్జెట్ ధరలో ఈ టీవీ లభిస్తోంది. రూ.19వేల కంటే తక్కువ ధరకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చును. క్రిడిట్ కార్డు ఆఫర్లను వినియోగించుకుంటే మరింత తక్కువకే లభిస్తుంది.43అంగుళాల 4కే రెజల్యూషన్ స్మార్ట్ టీవీ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.18,499కే అందుబాటులో ఉంది. రూ.20 వేలల్లో టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బాగా సూట్ అవుతుంది. ఐఫాల్కన్ 4 కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.23,499గా ఉండగా..ఆఫర్లో రూ.18,499కు దొరుకుతుంది.

flipkart big billion days 43 inch 4k tv-rice is only rs 16 thousand
iFFALCON Smart TV : టీసీఎల్ బ్రాండ్ నుంచి తక్కువ ధరకే 4కే టీవీ
ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే రూ.1,500 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.అనగా కేవలం రూ.16,999కే 4కే టీవీని సొంతం చేసుకోవచ్చు.ఐసీఐసీఐ,యాక్సిస్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ వస్తుంది. పాత టీవీ ఎక్స్‌చేంజ్ చేస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉంది. ఈ టీవీ హెచ్‌డీఆర్10, మైక్రో డిమ్మింగ్, డైనమిక్ కలర్, డాల్బీ ఆడియో, డీటీఎస్ సపోర్ట్‌తో 24వాట్ల వరకు సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను కలిగి ఉంది.ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.పాపులర్ ఓటీటీ చానెల్స్, యాప్స్, గేమ్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందవచ్చును.