Flipkart Offers : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త… 37వేల ఫోన్ కేవలం 17 వేలు మాత్రమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Offers : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త… 37వేల ఫోన్ కేవలం 17 వేలు మాత్రమే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 November 2022,9:00 pm

Flipkart Offers : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. నథింగ్ స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. మొబైల్ ఫోన్స్ సేల్స్ బొనాంజా లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. నథింగ్ ఫోన్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 37,999 గా ఉంది.

అయితే ఇప్పుడు ఇది 32,999 కి కొనవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తూ ఐదు శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ను 31,349 కు కొనవచ్చు. అలాగే ఈ ఫోన్ పై మరొక ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్పై 17,500 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. ఈ ఆఫర్స్ అన్నింటినీ కలిపితే నథింగ్ ఫోన్ ను 13,849 కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండిషన్ బట్టి ఉంటుంది. అందుకే తక్కువ ఎక్సైంజ్ విలువ కూడా రావచ్చు. అప్పుడు ఫోన్ కొనడానికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

Flipkart offers big discount on nothing phone 1

Flipkart offers big discount on nothing phone 1

నథింగ్ ఫోన్ లో 6.55 అంగుళాల స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్, 50 ఎంపీ + 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా , 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోను ఈఎంఐ లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ నెలకు 1144 నుంచి ప్రారంభం అవుతుంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే సంవత్సరానికి అయితే వాళ్లకి 3000 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది