Flipkart Offers : అదరగొడుతున్న ఫ్లిప్ కార్ట్ ఆఫర్ .. కేవలం 4 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Offers : అదరగొడుతున్న ఫ్లిప్ కార్ట్ ఆఫర్ .. కేవలం 4 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 January 2023,12:20 pm

Flipkart Offers : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే భారీ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 5జీ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఒప్పొ రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో కేవలం 4000 కే 5జి స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 37,990 గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 28,999కు అందుబాటులో ఉంది. అంటే 28% తగ్గింపు లభిస్తుంది. 256 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది.

యూపీఐ ద్వారా చెల్లిస్తే 250 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ ఫోను 28,740 కు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ కింద 24 వేల వరకు తగ్గింపు ధరను సొంతం చేసుకోవచ్చు. అంటే 4750 చెల్లిస్తే కొత్త 5జీ ఫోన్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫోన్లకు ఎక్స్చేంజ్ విలువ తక్కువ కూడా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 5జీ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంది. 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

flipkart offers 4000 smart phone

flipkart offers 4000 smart phone

ఈ ఫోన్ లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కలదు. అలాగే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ 3 నెలల వరకే ఉంటుంది. అంటే నెలకు రూ. 9,667 కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1400 చెల్లిస్తే సరిపోతుంది. 18 నెలలు అయితే రూ. 1810 కట్టాలి. 12 నెలలు అయితే రూ. 2600 కట్టాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది