Jio Customers : జియో కస్టమర్స్ పండగ చేసుకునే వార్త.. రూ.200లోపే ప్లాన్
Jio Customers : రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఓ సంచలనంగా నిలిచింది. టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కల్పిస్తూ వినియోగదారులని ఆకర్షించింది. జియో దెబ్బకు అన్ని నెట్‌వర్క్‌లు డమాల్ అన్నాయి. అయితే ఇటీవల జియో రీచార్జ్ ప్లాన్స్ పెంచడంతో ఎయిర్‌టెల్, వీఐ కూడా పయనిస్తూ.. రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచాయి. దీంతో వినియోగదారులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే రేట్లు పెంచిన జియో అప్పుడప్పుడు వినియోగదారులని సంతృప్తిపరుస్తూ […]
ప్రధానాంశాలు:
Jio Customers : జియో కస్టమర్స్ పండగ చేసుకునే వార్త.. రూ.200లోపే ప్లాన్
Jio Customers : రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఓ సంచలనంగా నిలిచింది. టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కల్పిస్తూ వినియోగదారులని ఆకర్షించింది. జియో దెబ్బకు అన్ని నెట్‌వర్క్‌లు డమాల్ అన్నాయి. అయితే ఇటీవల జియో రీచార్జ్ ప్లాన్స్ పెంచడంతో ఎయిర్‌టెల్, వీఐ కూడా పయనిస్తూ.. రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచాయి. దీంతో వినియోగదారులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే రేట్లు పెంచిన జియో అప్పుడప్పుడు వినియోగదారులని సంతృప్తిపరుస్తూ ఉంటుంది.
Jio Customers తక్కువ ధరకి..
ఎంటర్టైన్మెంట్ ఓటీటీ యాప్స్కు విపరీతమైన ఆదరణ ఉన్న ఈ తరుణంలో రిలయన్స్ జియో 200 రూపాయల లోపే ఓటీటీ ప్లాన్ను తీసుకొచ్చింది. 175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్తో 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుని 28 రోజుల పాటు ఆస్వాదించే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్‌లో 10 జీబీ హై స్పీడ్ డేటా కూడా పొందే అవకాశం ఉంది. మరో వైపు డైలీ లిమిట్ కాకుండా 10 జీబీ డాటాని వాడుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కస్టమర్స్ గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా బెన్ఫిట్స్, ఓటీటీ బెన్ఫిట్స్తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో కాలింగ్ సేవలు ఉండవు. ఓటీటీలో వినోదాన్ని కోరుకునే కోసం మాత్రమే ఈ 175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తీసుకువచ్చారు.
175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్ఎక్స్టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ,చౌపల్, డాకుబే, ఎపిక్ ఆన్, హోయ్ చొయ్ ఓటీటీ యాప్స్ లని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.సోని లివ్‌లో వెబ్ సిరీస్, సినిమాలకి కొదవే లేదు. ఇలాంటి వాటిని చక్కగా 175 రూపాయల రీచార్జ్ చేసుకొని ఆస్వాదించవచ్చు. జియోలో ఎంతో పాపురల్ అయిన అన్‌లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ రూ .395, రూ .1,559 ప్రీపెయిడ్ ప్లాన్లే అని చెబుతారు. చాలా మంది వీటినే రీఛార్జ్ చేసుకుంటారు. అయితే తాజాగా జియో ఈ ప్రిపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది