Pan Card Duplicate : పాన్ కార్డు పోయిందా.. అయితే డూప్లికేట్ కోసం ఇలా అప్లై చేయండి… అచ్చం ఒరిజినల్ లాగానే | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pan Card Duplicate : పాన్ కార్డు పోయిందా.. అయితే డూప్లికేట్ కోసం ఇలా అప్లై చేయండి… అచ్చం ఒరిజినల్ లాగానే

Pan Card Duplicate : మన దేశంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు అత్యంత అవసరమైనదిగా అయిపోయింది. అయితే మీరు ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే ఇకపై ఆందోళన చేయడం రావాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి డూప్లికేట్ పాన్ కార్డు ఈజీ ప్రాసెస్ లో పొందవచ్చు. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్లో చట్టపరమైన ప్రక్రియ ఒరిజినల్ పాన్ కార్డు లాగానే ఉంటుంది. ఈ పాన్ […]

 Authored By saidulu | The Telugu News | Updated on :4 October 2022,2:30 pm

Pan Card Duplicate : మన దేశంలో ప్రతి ఒక్కరికి పాన్ కార్డు అత్యంత అవసరమైనదిగా అయిపోయింది. అయితే మీరు ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే ఇకపై ఆందోళన చేయడం రావాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి డూప్లికేట్ పాన్ కార్డు ఈజీ ప్రాసెస్ లో పొందవచ్చు. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్లో చట్టపరమైన ప్రక్రియ ఒరిజినల్ పాన్ కార్డు లాగానే ఉంటుంది. ఈ పాన్ కార్డును ప్రతి చోట ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు…

అయితే డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకునే ప్రాసెస్, కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేయడం కంటే ఈజీ. దీనికోసం ముందుగా TI-NSDL అధికారిక పోర్టల్ కి వెళ్ళాలి. ఎడమవైపు ఆన్లైన్ పాన్ సేవను పొందడానికి క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆప్షన్ లో ఆన్లైన్ పాన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ చేసి పాన్ కార్డ్ రీప్రింట్ పై క్లిక్ చేయాలి. ఆన్లైన్ పాన్ కార్డ్ పొందడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చ కోడ్ ని ఫుల్ చేయాలి. దరఖాస్తు ఫారంను సమర్పించాలి. ఈ సమయంలో ఓటిపి కూడా పొందుతారు…

how to apply for duplicate pan card

how to apply for duplicate pan card

దేశంలో పాన్ కార్డ్ డెలివరీ చేయాలంటే దాని ధర 50గా ఉంది. అదే పాన్ కార్డుని దేశ వెలుపల డెలివరీ చేయడానికి రూ.959 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత రికార్డుగా నెంబరు ఇవ్వబడుతుంది. ఒరిజినల్ పాన్ కార్డు పోయినప్పుడు డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. కార్డులోని అడ్రస్ సంతకం కూడా ఏదైనా మార్చాలనుకుంటే డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు పోయిన లేదా దొంగలించబడిన ఈ పాయింట్లను గుర్తించుకోవాలి. దీనికోసం ముందుగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఈ ప్రాసెస్ పూర్తిచేసి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది