iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ !

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ !

iPhone 15 Plus : కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణావకాశం. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. మార్కెట్ ధర రూ.79,900 అయిన ఈ మోడల్, ఇప్పుడు క్రోమా స్టోర్స్ మరియు వెబ్‌సైట్‌లో రూ.71,490కే లభిస్తోంది. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.3,000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దాంతో ఐఫోన్ 15 ప్లస్ ను రూ.68,490 ధరకు సొంతం చేసుకోవచ్చు. సులభ వాయిదా (Low-cost EMI) లేదా వడ్డీ లేని వాయిదా (No-cost EMI) అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ.60,766 వరకు అదనపు విలువ పొందొచ్చు.

iPhone 15 Plus ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్ ఇది మీకు బెస్ట్ టైమ్

iPhone 15 Plus : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఇది మీకు బెస్ట్ టైమ్ !

iPhone 15 Plus : iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్..ఎంత తగ్గిందంటే !

2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్లస్, 2025లో కూడా పనితీరులో అదరగొడుతోంది. శక్తివంతమైన A16 బయోనిక్ చిప్, 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ లాంటి టాప్ క్లాస్ స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. కెమెరా విభాగంలో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఫోటోగ్రఫీ ప్రేమికులకు బెస్ట్ ఎంపిక. అలాగే, దీని బ్యాటరీ లైఫ్ కూడా ఐఫోన్ 15 సిరీస్‌లోనే అత్యుత్తమం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటల వరకు వీడియోలు చూసుకోవచ్చు. 20W USB టైప్-C ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఐఫోన్ 15 ప్లస్ మంచి ఫోన్ అయినా, కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో లేవు. ముఖ్యంగా, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే మిస్ అవుతుంది. అలాగే యాపిల్ 16 సిరీస్ ఫోన్లకు మాత్రమే లభించే ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్లు దీనికి అందుబాటులో ఉండవు. ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లు కావాలంటే ఐఫోన్ 16 ప్రో మోడల్స్ వైపు చూడాలి. అయినా, ఈ ధరకు ఈ స్పెసిఫికేషన్స్ తో ఐఫోన్ 15 ప్లస్ అందుబాటులోకి రావడం బెస్ట్ అనే చెప్పవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది