Electric Car : అదిరింది కార్ రేంజ్ .. 51 వేలకే బ్రాండెడ్ కార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Electric Car : అదిరింది కార్ రేంజ్ .. 51 వేలకే బ్రాండెడ్ కార్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 November 2022,9:40 pm

Electric Car : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కార్ల కంపెనీలు కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా మార్కెట్లోకి రెండు కొత్త కార్లు వచ్చాయి. ఈ కార్ల రేంజ్ 500 కిలోమీటర్లు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన హ్యుందయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఐఓనిక్యూ 5 ఎలక్ట్రిక్ యుఎస్ వి బుకింగ్స్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వీటి బుకింగ్ డిసెంబర్ 20 నుంచి మొదలుకానున్నాయి. ఈ కారు పారమెట్రిక్ పిక్సెల్ డిజైన్ తో వస్తుంది. 20 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి.

ఇందులో కనెక్టెడ్ కార్ టెక్ ఏఆర్ అసిస్టెట్ హెడ్ అప్స్ డిస్ప్లే, మ్యాగ్నెటిక్ డాష్ బోర్డు, పానోరమిక గ్లాస్ రూఫ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు నాలుగు పవర్ ట్రైన్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ కార్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఈ కారు షోరూం ధర 59.95 లక్షలు. అలాగే ప్రవైగ్ డైనమిక్స్ కూడా తన ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసింది. బెంగళూరు స్టార్ట్ అప్ ఈ కార్ ను తయారు చేసింది ప్రారంభ ధర 38.5 లక్షలు. ఈ కారను ఈ ఎస్ యువిని 51 వేల తో బుక్ చేసుకోవచ్చు.

hyundai company launched electric cars

hyundai company launched electric cars

ఈ కారు లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. డిఫై ఎలక్ట్రిక్ ఎస్ యుబి లో 90kw బ్యాటరీ ఉంటుంది. 2.5 లక్షల కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ 210 కిలోమీటర్లు. ఇక ఈ కారు డెలివరీ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభ అవుతుంది. దేశవ్యాప్తంగా 3400 పిన్ కోడ్ లో డెలివరీ అవ్వబోతుంది. కొత్త కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర చాలా ఎక్కువ. కానీ రేంజ్ ఫీచర్లు బాగున్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది