Smart Phone : ఇలా చేస్తే పిల్లలు స్మార్ట్ ఫోన్ అస్సలు ముట్టరు..!
ప్రధానాంశాలు:
Smart Phone : ఇలా చేస్తే పిల్లలు స్మార్ట్ ఫోన్ అస్సలు ముట్టరు..!
Smart Phone : ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అనర్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చాక, ఇంటర్నెట్ చౌకగా లభిస్తుండడంతో దాని వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. దాదాపుగా 5,6 గంటలు స్మార్ట్ ఫోన్ లోనే మునిగితేలుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడడం వలన కళ్ళపై , గుండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేనినైనా పరిమితంగా వాడితే ఏమి కాదు కానీ అతిగా వాడటం వలన అది అనర్థమే అని అంటున్నారు. పిల్లల మనసు అద్దం లాంటిది. ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేస్తుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్, లాప్టాప్ వంటివి చూడటం తగ్గించి పిల్లలతో మాట్లాడడం, చిన్నచిన్న ఆటలు ఆడిపించడం వంటివి చేయాలి.
ప్రస్తుతం పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాం అంటున్నారు. చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు పిల్లల కోసం ఫోన్ లను చూడడం అలవాటు చేస్తున్నారు. అందులో వీడియోలు చూడడం అలవాటు చేస్తున్నారు. దీంతో ఫోన్ చూస్తే కానీ భోజనం చేయని పరిస్థితి ఏర్పడింది. గేమ్స్, వీడియోలు అంటూ గంటలు కొద్ది పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. కొందరు పిల్లలు ఫోన్ ఉంటే తప్ప అన్నం తినరు. అలాంటప్పుడు ముందు ఒక ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా అన్నం తినిపించాలి. పేచి పెట్టకుండా తింటే ఆ సమయాన్ని పెంచుకుంటూ ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్లకు అన్నం తినిపించడం అలవాటు చేయాలి. పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి. కూర ఎలా ఉంది అని అడగాలి.
కబుర్లు, చిన్న చిన్న కథలు చెబుతూ వారితో సరదాగా ఉంటే ఫోన్ చూపించి అన్నం తినిపించాల్సిన అవసరం ఉండదు. బాల్యం నుంచి పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. బొమ్మల పుస్తకాలు ఇవ్వడం, కథల పుస్తకాల్లోని కథలను వారికి చెప్పడం, చిన్న పజిల్స్ పరిష్కరించేలా చూడాలి. అప్పుడు వారు స్మార్ట్ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. పిల్లలను ఎప్పుడు ఇంట్లోనే ఉంచకూడదు. చుట్టుపక్కల, పక్కింటి పిల్లలతో ఆడుకునే చూసుకోవాలి. అవకాశం ఉంటే కాసేపు వారితో ఆడుకోవాలి. కాసేపు అవుట్డోర్ గేమ్స్, క్యారమ్స్ చెక్ వంటివి ఆడుతూ ఉంటే పిల్లలు స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడకుండా ఉంటారు.