5G Smart Phone : అదిరే ఫీచర్లతో ఇండియన్ కంపెనీ 5జీ స్మార్ట్ ఫోన్… ధర చాలా చీప్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

5G Smart Phone : అదిరే ఫీచర్లతో ఇండియన్ కంపెనీ 5జీ స్మార్ట్ ఫోన్… ధర చాలా చీప్…!

5G Smart Phone : ప్రస్తుతం 5జీ సర్వీస్ నడుస్తుంది. ఐఫోన్, సాంసంగ్ ఇతర కంపెనీలు తమ యూజర్ల కోసం 5జీ అప్డేట్ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ బ్రాండ్ అయినా లావా దేశంలో చౌకైన 5జి ఫోను రిలీజ్ చేసింది. ఈ సంస్థ లావా బ్లేజ్ 5జీ పేరుతో సరికొత్త ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,6:30 pm

5G Smart Phone : ప్రస్తుతం 5జీ సర్వీస్ నడుస్తుంది. ఐఫోన్, సాంసంగ్ ఇతర కంపెనీలు తమ యూజర్ల కోసం 5జీ అప్డేట్ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ బ్రాండ్ అయినా లావా దేశంలో చౌకైన 5జి ఫోను రిలీజ్ చేసింది. ఈ సంస్థ లావా బ్లేజ్ 5జీ పేరుతో సరికొత్త ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో రన్ చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా 5000 mah బ్యాటరీ ఉంటుంది. లావా బ్లేజ్ 5జి ఫోన్ ధర 9,999 మాత్రమే. ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్ ఆప్షన్లో లభిస్తుంది. అయితే ఫోన్ సేల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. EIS సపోర్టెడ్ 50 ఎంపీ AI కెమెరా దీంట్లో హైలెట్ గా ఉంది. 2k వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యూటీ హెచ్డీఆర్, నైట్ , పోర్ట్రైట్ మాక్రో,AI, ప్రో యుహెచ్ డి ఫిల్టర్స్ టైం లాప్స్, QR స్కానర్ వంటి కెమెరా ఫీచర్లను లావా అందిస్తుంది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్లో లావా తొలిసారి బ్లేడ్ 5 జి స్మార్ట్ ఫోన్ ప్రదర్శించింది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్ తో వస్తుంది.

Indian company lava launches cheapest 5G smart phone

Indian company lava launches cheapest 5G smart phone

720×1600 HD+ రిజల్యూషన్ తో 6.51 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. ఫోన్ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 700 ఆక్టాకోర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో లభిస్తుంది. అయితే ర్యామ్ ను 7 జీబీ వరకు విస్తరించుకునే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 50 గంటల టాక్ టైం అందజేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 165.3×76.4×8.9 mm కొలతలతో 207 గ్రాములు బరువును కలిగి ఉండబోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది