5G Smart Phone : అదిరిపోయే 5జీ స్మార్ట్ ఫోన్.. ఏకంగా రూ.49,500 తగ్గింపు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

5G Smart Phone : అదిరిపోయే 5జీ స్మార్ట్ ఫోన్.. ఏకంగా రూ.49,500 తగ్గింపు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 November 2022,2:20 pm

5G Smart Phone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. అయితే షావోమీ కంపెనీకి చెందిన 12 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఫోన్లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలదు. స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వంటి అదిరే ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జిబి ర్యామ్, 256 జీబీ మెమొరీ వేరియంట్ ధర 79,999 గా ఉంది. అయితే ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.54,999 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ను కొంటే అదనంగా 3000 తగ్గింపు లభిస్తుంది.

ఇంకా ఎంఐ ఎక్స్చేంజ్ డీల్ కూడా ఉంది. ఇందులో భాగంగా 16,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఎక్సైంజ్ రూపంలో ఐదు వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. అంటే ఈ ఫోన్ పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలుస్తుంది. ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే ఏకంగా 49,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. అదే 12 జిబి ర్యామ్, 256 జీబీ మెమొరీ వేరియంటల్ అయితే 58,999కి కొనవచ్చు. ఈ ఫోన్ పై కూడా దాదాపుగా అన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ర్యామ్ మాత్రమే పెరుగుతుంది. మిగతా స్పెసిఫికేషన్లు అన్ని ఒకేలా ఉంటాయి. ఈ ఆఫర్లు అన్నింటిని కలుపుకుంటే ఈ ఫోను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 30000 ఉంటే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు పొందవచ్చు.

5G Smart Phone a discount of Rs49500

5G Smart Phone a discount of Rs.49,500

ఐకూ 9 ప్రో స్మార్ట్ ఫోన్ కు పోటీగా మార్కెట్ లో వచ్చిన షావోమి 12 ప్రో లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. షావోమీ కంపెనీ ఇప్పుడు దీనికి అప్డేట్ వర్షన్ గా షావోమి 13 ప్రో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఫోన్ కు సంబంధించిన ఫోటోలు ఫీచర్లు ఎలా ఉంటాయని అంశంపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం ప్రీమియం స్మార్ట్ఫోన్ పై మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్లపై కూడా లభిస్తుంది. ఎం ఐ క్లియరెన్స్ సేల్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ అయితే కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు. స్టాక్ అంతవరకే డీల్స్ అందుబాటులో ఉండవచ్చు. ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ఆఫర్ చూసి కొనండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది