Jio Offer : ల్యాప్ టాప్ యూజర్లకు గుడ్ న్యూస్… బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో…!
Jio Offer : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ జియో ఎప్పటినుంచో లాప్ టాప్ లను అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. కొన్నేళ్లుగా దీని కోసం కష్టపడుతుంది. ఎట్టకేలకు ఇప్పుడు జియో లాప్టాప్ రూపొందుకుంది. జియో బుక్ గా పిలిచే ఈ ల్యాప్టాప్ ను సైలెంట్ గా సాదాసీదాగా ఆవిష్కరించారు. దీని ధర కూడా చాలా తక్కువ. సామాన్యులు కూడా కొనుగోలు చేసే విధంగా దీనిని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులో ఉండదని తెలిపింది. అయితే ప్రస్తుతం జియో లాప్టాప్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో మాత్రమే దొరుకుతుంది.
అంటే ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో జియో లాప్టాప్ ధర రూ.19,500 గా ఉంది. అయితే కమర్షియల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఎప్పుడు తీసుకొస్తారనేది క్లారిటీ లేదు. ఇటీవల ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో ఈ లాప్టాప్ ను ప్రదర్శించారు. ఆ వివరాల ప్రకారం దీపావళికి దేశంలోని నాలుగు నగరాల్లో జియో 5జి సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. అదే సమయంలో జియో లాప్టాప్ లో కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు జియో డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సిబ్బందికి అందుబాటులో ఉన్నటువంటి లాప్టాప్ మోడల్ లోనే అందరికోసం తీసుకురానున్నట్లు తెలిసింది.
ఫీచర్లు ధరల్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు అని సమాచారం.జియో తె లిపిన వివరాల ప్రకారం ఈ లాప్టాప్ భారత్లోనే తయారయింది. 1366×768 పిక్సెల్ రిజల్యూషన్ తో 11.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, జియో ఓఎస్ తో పనిచేస్తుంది. అయితే ఈ ప్రాసెసర్ కొద్దిగా పాతది అవడంతో గేమ్స్ ఎక్కువగా ఆడే వారికి ఈ జియో బుక్ పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు. జియో ప్రత్యేకంగా గేమర్లను దృష్టిలో పెట్టుకొని తీసుకు రావట్లేదు. ధర ఫీచర్లను బట్టి చూస్తే విద్యార్థుల కోసం లేదా ఫస్ట్ టైం లాప్టాప్ వాడాలనుకునే వారికోసం తెస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 5జి నెట్వర్క్ సేవలపై ఇప్పటికే రిలయన్స్ జియో క్లారిటీ ఇచ్చింది. ఈ నెట్వర్క్ ను ఢిల్లీ, ముంబై, కలకత్తా, వారణాసిలో అక్టోబర్ 5న ప్రారంభించినట్లు తెలిపింది. ఇతర నగరాల్లో కూడా ప్రయత్నిస్తామని పేర్కొంది.