UPI Payment : యూపీఐ పేమెంట్స్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారా… ఇలా చేస్తే తక్షణమే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది…!
ప్రధానాంశాలు:
UPI Payment : యూపీఐ పేమెంట్స్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారా... ఇలా చేస్తే తక్షణమే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది...!
UPI Payment : భారతదేశంలో UPI అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బు లావాదేవీలు అనేవి చాలా సులభంగా మారిపోయాయి. ఇక ఈ UPI సేవ కారణంగా ఎవరైనా సరే డబ్బును సులభంగా పంపవచ్చు లేదా సులభంగా స్వీకరించవచ్చు. అలాగే వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించవచ్చు. అయితే ఈ UPI సేవ ద్వారా ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మాత్రం సర్వర్ , సాంకేతిక లోపం కారణంగా చాలామంది డబ్బు లావాదేవీల విషయంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే UPI సేవలను ఉపయోగించినప్పుడు ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. UPI వినియోగదారులందరూ కూడా ఈ ప్రక్రియలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
UPI Payment లావాదేవీలలో సమస్య వస్తే ఏం చేయాలి…
UPI సేవలను వినియోగించి డబ్బులు ఆవాదేవీలు జరిపినప్పుడు మీకు ఏదైనా సమస్య ఎదురైతే మీరు వెంటనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI ) కి ఫిర్యాదు చేయవచ్చు. అయితే UPI ద్వారా డబ్బు బదిలీ చేసినప్పుడు కొన్నిసార్లు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా అయినట్టు చూపిస్తుంది. కానీ మనం పంపించిన వారికి మాత్రం ఆ డబ్బు చేరదు. ఇలాంటి సమస్యలను మీరు UPI లో ఎదుర్కొన్నట్లయితే ఈ వైఫల్యాన్ని నివేదించడానికి దిగువన ఉన్న సూచనలు అనుసరించాలి.
దీనికోసం ముందుగా మీరు NPCI వెబ్ సైట్ కి వెళ్లి “మనం ఏం చేస్తున్నాం” అనే మెనూకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం యూపీఐ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది.
యూపీఐ విభాగంలో వివాద పరిష్కార ప్రక్రియపై క్లిక్ చేయండి.
అదేవిధంగా ఫిర్యాదు విభాగంలోకి వెళ్లి లావాదేవీల యొక్క ఎంపిక ఎంచుకోవాలి.
అనంతరం ఫిర్యాదు ప్రకారం లావాదేవీ యొక్క ఆకృతిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇష్యూ లావాదేవీలు విఫలమైనట్లయితే మీ అకౌంట్ నుంచి డెబిట్ చేయబడిన మొత్తం ఎంచుకుని మీ యూపీఐ సమస్య గురించి క్లుప్తంగా వివరించండి.
అనంతరం లావాదేవి ఐడి మరియు బ్యాంకు పేరు UPI ID మొత్తం నగదు, లావాదేవీ తేదీ ఈమెయిల్ చిరునామా మొదలైనవి తెలియజేయండి.
ఆ తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అందించి అప్డేట్ చేయబడిన మీ యొక్క బ్యాంకు స్టేట్ మెంట్ మరియు ఫోటోలను అప్లోడ్ చేయండి.
ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇచ్చిన అన్ని వివరాలను మరోసారి కచ్చితంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి. మీరు ఈ సూచనలను పాటించడం ద్వారా మీ యొక్క UPI లావాదేవీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా సురక్షితమైన లావాదేవీలు చేయవచ్చు.