Post Offices : శుభవార్త… ఇకపై పోస్ట్ ఆఫీస్ ల్లోనూ UPI సేవలు..!
ప్రధానాంశాలు:
పోస్ట్ ఆఫీస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి UPI సేవలు
post offices : ఈ కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నదైనా పెద్దదైనా లావాదేవీ ఫోన్‌తో స్కాన్ చేసి కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. కానీ ఇప్పటివరకు పోస్టాఫీసుల్లో మాత్రం ఈ సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నగదు చెల్లింపులలో జాప్యం, చిల్లర లభించకపోవడం, భద్రత సమస్యలు వంటి సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు భారత పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Post Offices : శుభవార్త… ఇకపై పోస్ట్ ఆఫీస్ ల్లోనూ UPI సేవలు..!
post offices : ఇకపై పోస్ట్ ఆఫీస్ ల్లో ఆ ఇబ్బందులు ఉండవు.. ఎందుకంటే అక్కడ కూడా UPI సేవలు స్టార్ట్
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 32 ప్రధాన, 689 సబ్, 5,006 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇకపై వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం వల్ల పొత్తికాగితాలు, లాంగ్ క్యూలైన్ల సమస్యలేవీ ఉండవు. కొన్ని సెకన్లలోనే లావాదేవీలు పూర్తవుతాయి. ఆగస్టు నెల నుండి ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని కేంద్ర పోస్టల్ శాఖ నిర్ణయించింది.
ఈ యూపీఐ సేవలు కేవలం చెల్లింపులను సులభతరం చేయడమే కాదు, పోస్టాఫీసులను ఆధునికీకరించే దిశగా అడుగు కూడా. చిన్న గ్రామాల్లోని ప్రజలకూ డిజిటల్ చెల్లింపులపై అవగాహన కలగడం, ఫైనాన్షియల్ సాహేత్యం పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పరివర్తనకి ఇది ఒక మైలురాయి. ప్రస్తుతం ఈ సేవలు ప్రారంభమైన పోస్టాఫీసుల్లో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఇంతకాలం నగదు కోసం బ్యాంకులు లేదా ఎటిఎంల చుట్టూ తిరగాల్సివచ్చింది. కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫీసులోనే ఫోన్‌తోనే చెల్లించేసుకోవచ్చు” అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పుతో పోస్టాఫీసులు కేవలం లెటర్లు పంపే కేంద్రాలుగా కాకుండా, ఆధునిక ఫైనాన్షియల్ సర్వీసుల కేంద్రాలుగా మారనున్నాయి.