One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వన్‌ప్లస్ 12.. ఫీచర్స్ ఏంటంటే..!
ప్రధానాంశాలు:
One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వన్‌ప్లస్ 12.. ఫీచర్స్ ఏంటంటే..!
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే, మరియు ట్రిపుల్ కెమెరా సహా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో గత సంవత్సరం జనవరిలో విడుదల అయింది. ఇప్పటికీ టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటిగా ఉంది.

One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వన్‌ప్లస్ 12.. ఫీచర్స్ ఏంటంటే..!
One Plus 12 Phone : అద్భుతమైన ఫీచర్స్..
ప్రస్తుతం అమెజాన్ లో 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.51998 గా ఉంది. అంటే సుమారుగా రూ.13 వేల తగ్గింపును పొందవచ్చు. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.56998 గా ఉంది. సుమారుగా రూ.13 వేల తగ్గింపు ధరకు అందుబాటులోకి ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా గరిష్టంగా రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఈ ఫోన్ ప్రస్తుతం సిల్కీ బ్లాక్, గ్లేసియల్ వైట్, ఫ్లోలీ ఎమరాల్డ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వన్‌ప్లస్ వెల్లడించింది. ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W SUPERVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 26 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది.