UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  UPI New Service గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో ఫీచర్ ఫోన్‌ల కోసం UPI సర్వీస్ విస్తృతం చేసేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం PhonePe, గప్‌షప్ GSPayని కొనుగోలు చేసింది.వీటితో ట్రాన్సాక్ష‌న్స్ సులువు అవుతున్నాయి. అయితే ఫీచర్ ఫోన్ కస్టమర్ల కోసం UPI పేమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గప్‌షప్ నుండి GSPayని కొనుగోలు చేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు.

UPI New Service గుడ్‌న్యూస్‌ చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు ఎలా అంటే

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : ఇలా చేసుకోండి..

GSPay అనేది UPI 123PAY ఆధారంగా రూపొందించిన ఒక మొబైల్ ఫోన్ యాప్. ఈ యాప్‌ను 2023 సంవత్సరంలో గప్‌షప్ ప్రారంభించింది. ఫీచర్ ఫోన్‌లలో SMS ఉపయోగించి ట్రాన్సక్షన్ చేయడం GSPay కీలక పని. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం UPI లావాదేవీల కోసం NPCI ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో GSPayని కొనుగోలు చేయడం ద్వారా PhonePe ఈ UPI 123PAY సేవను ప్రారంభించింది.

UPI 123PAY సేవను ఉపయోగించడానికి ముందుగా మీరు ఒక UPI IDని క్రియేట్ చేసుకోవాలి. ఫీచర్ ఫోన్ వినియోగదారులు *99# డయల్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకు ముందుగా * మీ ఫోన్ నుండి *99# నంబర్‌ను డయల్ చేయండి. * ఇక్కడ చాల అప్షన్స్ చూపిస్తాయి, అందులో మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోండి. * మీ డెబిట్ కార్డ్‌లో ఉన్న చివరి 6 అంకెలను ఇప్పుడు ఎంటర్ చేయండి. * ఆ తర్వాత, మీ UPI పిన్‌ను క్రియేట్ చేసుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది