UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
ప్రధానాంశాలు:
UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి. చిన్న కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, ఆటో డ్రైవర్లు, ఇంకా బిచ్చగాళ్లు కూడా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్‌లతో డిజిటల్ చెల్లింపుల బాట పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. జేబులో రూపాయి లేకున్నా దేశం మొత్తం తిరగొచ్చే స్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ పేమెంట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
UPI రూ.2వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ..?
తాజా సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం రూ.2వేలు పైబడి చేసే యూపీఐ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెంచే దిశగా ఇది ఒక కొత్త మార్గమని భావిస్తోందట. ఇటువంటి చర్య అమలులోకి వస్తే, దీని ప్రభావం సామాన్య వినియోగదారుల నుంచి చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజల వరకు ఎక్కువగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా ఉచితంగా చేసుకొచ్చిన డిజిటల్ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తే వినియోగదారులకు అదనపు భారం మోపినట్టే అవుతుంది.
డిజిటల్ వ్యవస్థపై ప్రభావం పడేలా ఉందా?
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, డిజిటల్ చెల్లింపుల ఉత్సాహాన్ని తగ్గించే ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు మళ్లీ నగదు లావాదేవీల వైపు మళ్లే అవకాశం ఉందని, ఇది ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల భారం పెరగకూడదని, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం కొనసాగించాలన్నదే ప్రజల అభిమతమని వ్యాపారవర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.