Credit Card New Rules : క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులపై ఆర్బిఐ కీలక నిర్ణయం… జులై 1 నుండి కొత్త నిబంధనలు..!
Credit Card New Rules : క్రెడిట్ కార్డు ఉపయోగించి పలు రకాల బిల్లు చెల్లింపులు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. మరికొద్ది రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మరి అవేంటి వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ ఉపయోగించి బిల్లు చెల్లింపులకు జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. తద్వారా జూన్ 30 తర్వాత నుండి కొన్ని ప్లాట్ ఫామ్ లలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడం కష్టతరంగా మారవచ్చు.
అయితే జూన్ 30 తర్వాత నుండి జరిగే ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ( BBPS ) ద్వారా ప్రాసెస్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే HDFC , ICICI , AXIS బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన BBPS ని ప్రారంభించలేదు. అంతేకాక ఇప్పటివరకు ఈ బ్యాంకులు మొత్తం 5 కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లను ఖాతాదారులకు జారీ చేశారు. అయితే ఈ బ్యాంకులు మాత్రం ఇంకా సూచనలను పాటించలేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే BBPS సభ్యులుగా ఉన్నటువంటి PHONE PAY మరియు CRED వంటి ఫిన్ టెన్ లు జూన్ 30 తర్వాత నుండి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చెల్లింపులను ప్రాసెస్ చేయలేవు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిన్ టెన్ లను నిర్వహించాలంటే బ్యాంకులన్ని కచ్చితంగా RBI నిబంధనలను అనుసరించాలి. అయితే RBI ఆదేశించిన నియమాలు జూన్ 30 వరకు చెల్లిస్తాయి.
నివేదిక ప్రకారం..పరిశ్రమ వారి యొక్క చెల్లింపుల గడువును 90 రోజుల వరకు పొడిగించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 8 బ్యాంకులు మాత్రమే BBPS చెల్లింపులను ప్రారంభించాయి. దీనిలో మొత్తం 34 బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతించబడ్డాయి. అయితే RBI ఆదేశించిన BBPS ని ప్రారంభించిన బ్యాంకులలో SBI ,BOB , ఇండస్ఇండ్ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంక్ వంటివి ఉన్నాయి. మోసపూరిత లావాదేలను గుర్తించి పరిష్కరించడానికి BBPS ఉపయోగపడుతుందని వీటిలోని చెల్లింపు ధరలను RBI గమనించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.