Redmi Smart Phone : అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రాబోతున్న రెడ్ మీ స్మార్ట్ ఫోన్… కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్..!
Redmi Smart Phone : చైనా కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 12 సిరీస్ అడుగుపెట్టింది. రెడ్ మీ నోట్ 12 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో+ 5జీ, రెడ్ మీ నోట్ 12 ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ వచ్చాయి. అన్ని మోడల్స్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండే OLED డిస్ప్లే లను కలిగి ఉన్నాయి. అయితే ఈ మోడల్స్ లో రెడ్ మీ నోట్ డిస్కవరీ ఎడిషన్ స్పెషల్ గా కనిపిస్తోంది. స్పెసిఫికేషన్లో రెడ్ మీ నోట్ 12 5జీ ని పోలి ఉండగా ప్రత్యేకమైన బ్యాక్ ప్యానెల్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. ఈ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే అత్యధిక ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ఇది.
రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ రెడ్ మీ నోట్ 12 డిస్కవర్ ఎడిషన్ ఫోన్స్ వాటి లాగానే వస్తున్నాయి. అధిక ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ మాత్రమే వేరుగా ఉంటాయి. రెడ్ మీ నోట్ 12 ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఫోన్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే ను కలిగి ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్ HDR 10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి. మీడియా టెక్ డైమంన్సిటీ 1080 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బెస్ట్ ఎఎంయూఐ 13 తో వస్తుంది. ఈ ఫోన్ లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో 4500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 210 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. సున్నా నుంచి 100% వరకు కేవలం 9 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని షావోమి తెలిపింది. ప్రస్తుతం ఈ రెడ్ మీ నోట్ 12 డిస్కవర్ ఎడిషన్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 256 స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 27,200 గా ఉంది. షావోను రెడ్ మీ నోట్ 12 సిరీస్ ఇండియాలోకి కూడా తీసుకొస్తుంది. అయితే డిస్కవరీ ఎడిషన్ ను ఇండియాలో లాంచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.