Redmi A1 Plus : రెడ్ మీ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్…ధర ఎంతంటే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 October 2022,8:00 am

Redmi A1 Plus : ఇండియన్ మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్ మీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఏ1 సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. Redmi A1 +స్మార్ట్ ఫోన్ ఈ వారంలో విడుదల కానుంది. ఇండియన్ మార్కెట్లో ఈనెల 14వ తేదీన ఈ 4జీ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు రెడ్ మీ అధికారికంగా ప్రకటించింది. డిజైన్ హైలెట్ చేసింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ రెడ్ మీ ఏ1+ తీసుకువస్తుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లెదర్ టెక్చర్ ఫినిష్ ఉండే బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతుంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ డిస్ప్లే చుట్టు చాలా స్లిమ్ బెజిల్స్ తో ఈ బడ్జెట్ ఫోన్లో తీసుకొస్తున్నట్లు రెడ్ మీ ప్రకటించింది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్ప్లే టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. స్టైలిష్ ఫోన్ అంటూ వెల్లడించారు. గ్లోబల్ గా లాంచ్ అయిన స్పెసిఫికేషనులతో భారత్ లోను రెడ్ మీ ఏ1+రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 8 మెగా పిక్సెల్ కెమెరా గా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్సెల్ సామర్థ్యంతో రాబోతుంది. 6.5 ఇంచుల హెచ్ డి ప్లస్ డాట్ డిస్ప్లే తో రెడ్ మీ ఏ1+వస్తుందని అంచనా. మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ పై పనిచేస్తుంది.

Redmi launches Redmi A1 Plus phone

Redmi launches Redmi A1 Plus phone

ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో అందుబాటులోకి వస్తుంది. 4జి కనెక్టివిటీ ఉంటుంది. చార్జింగ్ కోసం టైప్ సి పోర్ట్ ను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ ప్యానెల్ కు ఉంటుంది. అయితే భారత్లో ఇటీవలే రెడ్ మీ ఏ1 విడుదల అయింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మీడియా టెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ 6.52 ఇంచుల హెచ్ డి ప్లస్ డిస్ప్లే తో ఈ ఫోన్ వస్తుంది. దీని ధర రూ.6499 గా ఉంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వెనుక 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాలుతో వచ్చింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రెడ్ మీ a1 వస్తుంది. దీనికి అప్డేట్ గానే రెడ్ మీ ఏ వన్ ప్లస్ రాబోతుంది. ఈ కొత్త ఫోన్ ధర కూడా పదివేల లోపే ఉంటుంది.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి