Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బ‌కి దిగొచ్చిన జియో.. స‌ర‌స‌మైన ధ‌ర‌లకే ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బ‌కి దిగొచ్చిన జియో.. స‌ర‌స‌మైన ధ‌ర‌లకే ప్లాన్

 Authored By ramu | The Telugu News | Updated on :4 September 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బ‌కి దిగొచ్చిన జియో.. స‌ర‌స‌మైన ధ‌ర‌లకే ప్లాన్

Jio : జియో ఇటీవ‌ల రేట్లు పెంచ‌డం మ‌నం చూశాం. స‌డెన్‌గా ప్లాన్ ఆఫ‌ర్స్ పెంచ‌డంతో వినియోగ‌దారులు గ‌గ్గోలు పెట్టారు. అయితే బీఎస్ఎన్ఎల్ జియోకి చెక్ పెట్టేలా ఆఫర్స్ ప్ర‌క‌టిస్తుండ‌డంతో జియో దిగి రాక త‌ప్ప‌డం లేదు. నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.

Jio చెక్ పెట్టేలా…

ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. సాధారణంగా కాల్స్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి 200 మధ్య ఉంటాయి.అయితే నెలకు కేవలం రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ ని జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ తో అదనంగా 24 జీబీ ల హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.

Jio బీఎస్ఎన్ఎల్ దెబ్బ‌కి దిగొచ్చిన జియో స‌ర‌స‌మైన ధ‌ర‌లకే ప్లాన్

Jio : బీఎస్ఎన్ఎల్ దెబ్బ‌కి దిగొచ్చిన జియో.. స‌ర‌స‌మైన ధ‌ర‌లకే ప్లాన్

ఇక ఏడాది కాకుండా కేవలం నెలవారి ప్లాన్ ని పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు 2 జీబీ డేటా కూడా పొందవచ్చు. వినియోగదారులు జియోటీవీ, జీయో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో అనుబంధ యాప్‌ల సర్వీసులు పొందవచ్చు.టెలికాం రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కంపెనీలపై పై చేయి సాధించేందుకు ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మన దేశంలో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలను అందిస్తున్నాయి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది