Smart TV : మతిపోగొట్టే భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.70వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.26వేలకే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smart TV : మతిపోగొట్టే భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.70వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.26వేలకే..!

 Authored By mallesh | The Telugu News | Updated on :18 October 2022,8:00 am

Smart TV : స్మార్ట్‌టీవీ కొనాలని చాలా రోజులుగా ఎదురుచూసే వారికోసం బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్.ప్రస్తుతం ఇందులో దివాళీ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించారు.స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. టీసీఎల్ కంపెనీకి చెందిన ఐఫాల్కన్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. 55 అంగుళాల టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్ లభిస్తోంది. దీని మీద ఏకంగా 60 శాతం డిస్కౌంట్ దొరుకుతోంది.

బిగ్ స్క్రీన్ టీవీ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆఫర్. ఐఫాల్కన్ కే 61.. 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఈ ఆఫర్ వర్తించనుంది. మార్కెట్లో దీని అసలు ధర రూ.70,990 ఉండగా.. బిగ్ దీపావళి సేల్‌ ఆఫర్‌లో భాగంగా ఈ టీవీ రూ.27,990కు లభిస్తోంది. అనగా 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.దీనిపై మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు అదనపు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.

Rs70 thousand smart TV for only Rs26 thousand

Rs.70 thousand smart TV for only Rs.26 thousand

Smart TV : టీసీఎల్ ఐఫాల్కన్ పై భారీ తగ్గింపు

10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ దొరుకుతుంది. గరిష్టంగా రూ. 1750 వరకు తగ్గింపు లభిస్తోంది. టీసీఎల్ టీవీ ధర రూ.26,240కు డిస్కౌంట్‌కు లభించనుంది. సాధారణ రోజుల్లో 55 అంగుళాల 4కే టీవీ ఇంత తక్కువ ధరకు లభించం సాధ్యం కాదని చెప్పవచ్చు. టీసీఎల్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.ఈఎంఐలో కూడా టీవీని కొనుగోలు చేయవచ్చు.నెలకు రూ.1358 నుంచి ఈఎంఐ ప్రారంభం కానుంది. 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. టీసీఎల్ ఐ ఫాల్కన్ పై ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అందుకోసం నెలకు రూ.2648 చెల్లించాల్సి ఉంటుంది..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది