Samsung Galaxy M56 5g : శామ్ సంగ్ నుండి మరో క్రేజీ ఫోన్ విడుదల.. ఫీచర్స్ ఏంటంటే..!
ప్రధానాంశాలు:
Samsung Galaxy M56 5g : శామ్ సంగ్ నుండి మరో క్రేజీ ఫోన్ విడుదల.. ఫీచర్స్ ఏంటంటే..!
Samsung Galaxy M56 5g : టెక్ దిగ్గజం శాంసంగ్ నుండి ఇటీవల అనేక ఫోన్స్ విడుదల అవుతుండగా,అవి వినియోగదారులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గత నెలలో గెలాక్సీ A26, A36, A56 స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా శాంసంగ్ నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ నెలలో మరో ఫోన్‌ను లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 17 వ తేదీన విడుదల కానుంది.

Samsung Galaxy M56 5g : శామ్ సంగ్ నుండి మరో క్రేజీ ఫోన్ విడుదల.. ఫీచర్స్ ఏంటంటే..!
Samsung Galaxy M56 5g : మంచి ఫీచర్స్‌తో..
ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ M55 కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ M55 హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే.. ఏప్రిల్ 17న లాంచ్ కానున్న గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 30 శాతం స్లిమ్ డిజైన్‌తో లాంచ్ కానుంది. మరియు 36 శాతం సన్నని బెజెల్స్, 33 శాతం బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ Exynos 1480 SoC ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 12MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా 10 బిట్స్ HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది . ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.