Samsung : శాంసంగ్ బంపర్ ఆఫర్‌… టీవీ కొంటే శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samsung : శాంసంగ్ బంపర్ ఆఫర్‌… టీవీ కొంటే శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీ..!

Samsung : మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా. అయితే శాంసంగ్ కంపెనీ స్మార్ట్ టీవీ కొనుగోలుపై స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తుంది. ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన శాంసంగ్ ఈ సంవత్సరం పలు రకాల కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఇక శాంసంగ్ స్మార్ట్ టీవీల ధరలను పరిశీలిస్తే , 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.61,990 /-గా ఉంది. 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 73,990.55/- గా మరియు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 September 2022,4:00 pm

Samsung : మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా. అయితే శాంసంగ్ కంపెనీ స్మార్ట్ టీవీ కొనుగోలుపై స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తుంది. ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన శాంసంగ్ ఈ సంవత్సరం పలు రకాల కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. ఇక శాంసంగ్ స్మార్ట్ టీవీల ధరలను పరిశీలిస్తే , 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.61,990 /-గా ఉంది. 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 73,990.55/- గా మరియు 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.91,990/- మరియు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.1,27,990/- ఇక చివరిగా 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.2,99,990/- గా ఉన్నాయి .

ఈ కొత్త స్మార్ట్ టీవీలు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ , శాంసంగ్.కమ్ లో అందుబాటులో ఉన్నాయి అయితే శాంసంగ్ కంపెనీ నోమోఫోమో సేల్ కింద స్మార్ట్ టీవీ కొన్నవారికి స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తుంది.శాంసంగ్ అధికారిక స్టోర్ లేదా శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డులపై 22 శాతం ఆఫర్ ఇస్తుంది.బ్యాంక్ ఆఫర్లు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఇంకా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీలపై 43 శాతం,స్మార్ట్ టీవీలపై 48 శాతం , స్మార్ట్ ఫోన్లపై 52 శాతం మరియు ల్యాప్ టాప్స్ పై 30 శాతం ఆఫర్స్ ఉన్నాయి.

Samsung Offer Samsung Galaxy A32 Mobile Free With Purchase Of Samsung TV

Samsung Offer Samsung Galaxy A32 Mobile Free With Purchase Of Samsung TV

అయితే ఏ ఏ ఫ్రేమ్ టీవీలకు స్మార్ట్ ఫోన్ ఆఫర్ వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది . దీని విలువ రూ.21.490 /- గా ఉంది. అలాగే 62 ఇంచెస్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గెలాక్సీ ఏ 03 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది. దీని ధర రూ.9.499 /- గా ఉంది . అలాగే 8కే టీవీపై గెలాక్సీ ఎస్22 ఫోన్ ఉచితంగా పొందవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది