SBI : మీ ఎస్‌బీఐ ఖాతా నుండి అమౌంట్ క‌ట్ అయిందా? అందుకు కార‌ణం ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : మీ ఎస్‌బీఐ ఖాతా నుండి అమౌంట్ క‌ట్ అయిందా? అందుకు కార‌ణం ఏంటంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  SBI : మీ ఎస్‌బీఐ ఖాతా నుండి అమౌంట్ క‌ట్ అయిందా? అందుకు కార‌ణం ఏంటంటే..!

SBI  : ఈ మ‌ధ్య అకౌంట్ హ్యాకింగ్ ఎక్కువ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్‌గా ఎలాంటి మెసేజ్‌ Message రాలేదు.? ఎవరికీ డబ్బులు పంపించలేదు. కానీ ఖాతా నుంచి రూ 236 కట్‌ అయ్యాయి. దీంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. అయితే దీనికి కార‌ణం ఏంటంటే..ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ కార్డులను వసూలు చేస్తోంది.

SBI మీ ఎస్‌బీఐ ఖాతా నుండి అమౌంట్ క‌ట్ అయిందా అందుకు కార‌ణం ఏంటంటే

SBI : మీ ఎస్‌బీఐ ఖాతా నుండి అమౌంట్ క‌ట్ అయిందా? అందుకు కార‌ణం ఏంటంటే..!

SBI  కార‌ణం ఇది..

ఎస్‌బీఐ SBI  క్లాసిక్‌, సిల్వర్‌, గ్లోబల్‌ వంటి కార్డులకు సంబంధించిన వార్షిక రుసుము రూ. 200గా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ వసూలు చేసిందన్నమాట. అయితే రూ. 236 ఎందుకు కట్‌ చేశారంటే ఈ ట్రాన్సాక్షన్‌పై Transaction 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. దీని ప్రకారం 18 శాతం అంటే రూ. 36 ట్యాక్స్‌ ఉంటుందన్నమాట. ఇలా మొత్తం రూ. 236 అకౌంట్‌ నుంచి కట్‌ అవుతున్నాయన్నమాట.

అయితే ఈ మెయింటెనెన్స్‌ ఛార్జీలు అనేవి మనం ఉపయోగించే కార్డ్‌ రకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో సరిపడ అమౌంట్‌ లేకపోతే బ్యాలెన్స్‌ మైనస్‌ Minus అవుతుంది. ఇదిలా ఉంటే ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితిని అమలు చేసింది. దీని ప్రకారం యూజర్లు రోజుకు గరిష్టంగా 10 లావాదేవీలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్సాక్షన్‌ చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది