SBI గుడ్‌న్యూస్.. హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. ఎంసీఎల్ఆర్ సవరింపు జులై 15 నుంచి..!
ప్రధానాంశాలు:
SBI గుడ్‌న్యూస్.. హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. ఎంసీఎల్ఆర్ సవరింపు జులై 15 నుంచి..!
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా state bank of india (SBI) తమ వినియోగదారులకు జూలై 15న సంతోషకరమైన సమాచారం ఇచ్చింది. అన్ని కాలవ్యవధుల రుణాలపై వడ్డీ రేట్లకు ఆధారంగా ఉండే ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు గరిష్టంగా 25 బేసిస్ పాయింట్ల వరకు ఉండగా, తాజా వడ్డీ రేట్లు జూలై 15 నుంచే అమల్లోకి వచ్చాయి.

SBI గుడ్‌న్యూస్.. హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు.. ఎంసీఎల్ఆర్ సవరింపు జులై 15 నుంచి..!
SBI నెలకు ఎంత ఈఎంఐ
తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు (జూలై 2025) చూస్తే.. బ్యాంకులో ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. ఇక్కడ ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిందని చెప్పొచ్చు. 3 నెలల MCLR విషయానికి వస్తే 8.55 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గింది. ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 8.80 శాతానికి దిగొచ్చింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 8.85 శాతానికి పడిపోయింది.ఇక మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గింది.
ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయిన లోన్లపై వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గుతాయి. మీ EMI (నెలవారీ చెల్లింపులు) తగ్గే అవకాశం ఉంటుంది.లేదా మీరు అదే EMI చెల్లిస్తూ లోన్ కాలవ్యవధిని (tenure) తగ్గించుకోవచ్చు. మంచి సిబిల్ స్కోరు ఉన్నవారికి ఇంకా తక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి.సాధారణ హోం లోన్: 7.50% నుంచి 8.45% వరకు ఉంటుంది.