Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా…!
ప్రధానాంశాలు:
Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా...!
Mobile : సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అని సంతోష పడాలో లేక దాని వలన సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం చిన్నపిల్లాడి నుండి ముసలి వారి వరకు మొబైల్ తప్పనిసరి గా మారింది. అది లేదంటే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అలాగే గంటల తరబడి మాట్లాడే యువతి యువకులు కొన్ని సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. అయితే అతిగా సెల్ ఫోన్ మాట్లాడడం వలన మెదడుకు కూడా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ మాత్రమే కాకుండా కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ వాడకం తప్పనిసరి అయ్యింది. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన చర్మవ్యాధులు మరియు వృద్ధాప్యం తొందరగా వస్తుంది అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నాయి. అంతేకాక దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ ఉపయోగించే వారి కళ్ళు మాత్రమే కాదు చర్మం కూడా ఎంతో తీవ్రంగా దెబ్బతింటుంది అని నిపుణులు అంటున్నారు.
అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ లాంటి డిజిటల్ పరికరాల నుండి వచ్చే కిరణాలు చర్మాన్ని ఎంతగానో దెబ్బతీస్తాయి. దీని వెనక నుండి వచ్చే బ్లూ లైట్ పాత్ర కీలకమైనది. ఈ కాంతి అనేది చర్మం లోని ప్రోటీన్లు మరియు కొల్లజెన్ మరియు ఫైబర్లను కూడా నాశనం చేయగలదు. అంతేకాక చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని కూడా పెంచగలదు. దీని ఫలితంగా ఎన్నో రకాల చర్మ సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మొబైల్ లేక ల్యాప్ టాప్ స్క్రీన్ నాలుగు గంటలు లేక అంతకన్నా ఎక్కువ సమయం నిరంతరంగా వాడడం వలన మెలనిన్ స్రావాల పరిమాణం అనేది పెరుగుతుంది. అలాగే చిన్న వయసులోనే చర్మం అనేది డల్ గా కూడా మారుతుంది. అయితే ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి …